Suresh Raina: భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) చిక్కుల్లో పడ్డారు. అక్రమ బెట్టింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన్ను విచారించింది. బుధవారం న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో రైనాను అధికారులు సుమారు 9 గంటల పాటు ప్రశ్నించారు.
విచారణకు కారణం ఏమిటి?
గత సంవత్సరం సురేష్ రైనా 1xBET అనే బెట్టింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. ఈ యాప్ ద్వారా క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలపై ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఇటువంటి బెట్టింగ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధం. ప్రస్తుతం ఈడీ ఇలాంటి అక్రమ బెట్టింగ్ యాప్‌లు, వాటి ద్వారా జరుగుతున్న ఆర్థిక మోసాలపై దృష్టి సారించింది. ఈ విచారణలో భాగంగానే యాప్‌తో సంబంధం ఉన్నందున రైనాను ప్రశ్నించేందుకు పిలిచారు.
Also Read: Morning Key Works : ఉదయాన్నే లేచి ఈ పని చేయడం లేదా? ఐతే మీ ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే?
9 గంటల పాటు సుదీర్ఘ విచారణ
బుధవారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న రైనాను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. 1xBET యాప్‌తో ఉన్న ఒప్పందం దాని ద్వారా అందుకున్న పారితోషికం, ప్రచార కార్యకలాపాల గురించి పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. రైనా ఈ యాప్ కోసం పలు ప్రకటనలలో కూడా నటించారు. ఈ యాప్‌ల ద్వారా ప్రజలు మోసపోతున్న ఘటనలు పెరగడంతో, ఈడీ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటోంది.
రైనాపై చర్యలు ఉంటాయా?
ప్రస్తుతానికి ఈడీ రైనాను కేవలం విచారణ కోసమే పిలిచింది. అతనిపై ఎలాంటి తీవ్రమైన ఆరోపణలు నమోదు కాలేదు. ఈ యాప్‌కు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ఏదైనా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాల్లో రైనా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఆధారాలు లభిస్తే, అతని ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈడీ అధికారులు రైనా వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.