Stop Clock Rule: నేటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రూల్.. ఈ నియమం ఏంటంటే..?

ఈరోజు (డిసెంబర్ 12) నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ కొత్త రూల్ ట్రయల్ ప్రారంభం కానుంది. ఈ నియమానికి 'స్టాప్ క్లాక్' (Stop Clock Rule) అని పేరు పెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Stop Clock Rule

Compressjpeg.online 1280x720 Image (2)

Stop Clock Rule: ఈరోజు (డిసెంబర్ 12) నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ కొత్త రూల్ ట్రయల్ ప్రారంభం కానుంది. ఈ నియమానికి ‘స్టాప్ క్లాక్’ (Stop Clock Rule) అని పేరు పెట్టారు. ఈ నిబంధన ప్రవేశంతో ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ జట్టు ఎక్కువ సమయం వృధా చేయలేరు. ఈ నిబంధన కేవలం తెల్ల బంతితో ఆడే క్రికెట్ ఫార్మాట్‌లో మాత్రమే వర్తిస్తుంది. అంటే టెస్టు క్రికెట్‌లో ఈ నిబంధనను ప్రవేశపెట్టరు.

ఈరోజు ప్రారంభం కానున్న ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో తొలిసారిగా ఈ నిబంధనను అమలు చేయనున్నారు. వచ్చే 6 నెలల పాటు వివిధ టీ20 సిరీస్‌లలో ఈ నిబంధనను అమలు చేయనున్నారు. ఇది ఆటపై ప్రతికూల ప్రభావం చూపకుండా, ప్రయోజనాలు కలిగి ఉంటే ఈ రూల్ T20, ODIలో శాశ్వతంగా ఉంచనున్నారు.

Also Read: IPL Mini Auction: ఐపీఎల్ మినీ వేలంలో 77 మంది ఆటగాళ్లకే ఛాన్స్..!

స్టాప్ క్లాక్ రూల్ అంటే ఏమిటి?

ఈ నిబంధన ప్రకారం.. ఒక ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపు బౌలింగ్ జట్టు రెండో ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒక ఓవర్ ముగిసిన వెంటనే థర్డ్ అంపైర్ వాచ్ ప్రారంభమవుతుంది. ఈ గడియారం స్టేడియంలోని పెద్ద స్క్రీన్‌పై నడుస్తూనే ఉంటుంది. బౌలింగ్ చేసే జట్టు 60 సెకన్లలోపు రెండవ ఓవర్‌ను ప్రారంభించకపోతే ఒక ఇన్నింగ్స్‌లో రెండుసార్లు ఇలా చేసినందుకు జరిమానా ఉండదు. అయితే ఇది మూడోసారి జరిగితే బౌలింగ్ జట్టుపై 5 పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. అంటే బ్యాటింగ్ చేసే జట్టుకు అదనంగా 5 పరుగులు ఇవ్వనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దానితో పాటు మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బ్యాటింగ్ చేసే జట్టు సమయాన్ని వృధా చేస్తే తర్వాత బౌలింగ్ చేయడానికి బయటకు వచ్చినప్పుడు వృధా అయిన సమయం దానికి అందుబాటులో ఉన్న మొత్తం సమయం నుండి తీసివేయబడుతుంది. 6 నెలల ట్రయల్ తర్వాత ఈ నియమం ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి పూర్తి విశ్లేషణ ఉంటుంది. తర్వాత దానిని కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.

  Last Updated: 12 Dec 2023, 08:43 AM IST