Site icon HashtagU Telugu

Australia: ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్మిత్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆసీస్ జట్టు ప్రకటన

Australia

Australia

Australia: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 19న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు తమ స్క్వాడ్ ను సిద్ధం చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా (Australia) తమ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహిస్తుండగా, ఆ జట్టు ముగ్గురు స్టార్ పేసర్లు లేకుండా టోర్నమెంట్ ఆడనుంది. కంగారూ జట్టులోని ముగ్గురు స్టార్ ఫాస్ట్ బౌలర్లు, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ మరియు జోష్ హాజిల్‌వుడ్ జట్టులో లేరు. ఇది నిజంగా ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల స్టార్క్ టోర్నమెంట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతనితో పాటు పాట్ కమ్మిన్స్ మరియు జోష్ హాజిల్‌వుడ్ కూడా టోర్నీకి దూరమయ్యారు. గాయం కారణంగా కమిన్స్ మరియు హాజిల్‌వుడ్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. గత వారం గాలెలో శ్రీలంకతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో స్టార్క్ కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. స్టార్క్ ఎడమ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. కాగా స్టార్క్, కమ్మిన్స్ మరియు హాజిల్‌వుడ్ లేకపోవడంతో ఫాస్ట్ బౌలర్లు స్పెన్సర్ జాన్సన్, నాథన్ ఎల్లిస్, సీన్ అబాట్ మరియు బెన్ ద్వార్షిస్‌లకు అవకాశం ఇచ్చారు.

Also Read: Pawan Kalyan: తిరువల్లం శ్రీ పరుశురాముని సేవలో పవన్ కళ్యాణ్

ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.