Zimbabwe T10 League: వచ్చేసింది మరో టీ10 లీగ్

టీ10...క్రికెట్ నయా ఫార్మాట్.. గత ఆరేళ్ళగా అబుదాబీ టీ10 లీగ్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. కేవలం 90 నిమిషాల్లో క్రికెట్ ఫ్యాన్స్ కు ఎంతో వినోదాన్ని అందిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Zimbabwe T10 League

New Web Story Copy 2023 07 18t210903.552

Zimbabwe T10 League: టీ10…క్రికెట్ నయా ఫార్మాట్.. గత ఆరేళ్ళగా అబుదాబీ టీ10 లీగ్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. కేవలం 90 నిమిషాల్లో క్రికెట్ ఫ్యాన్స్ కు ఎంతో వినోదాన్ని అందిస్తోంది. దుబాయ్ కి చెందిన టీ10 లీగ్ స్పోర్ట్స్ ఈ లీగ్ ను తీసుకొచ్చింది. ఐసీసీ గుర్తింపు కూడా పొందిన ఈ లీగ్ లో ప్రపంచ వ్యాప్తంగా పలువురు స్టార్ క్రికెటర్లు కూడా సందడి చేశారు. ఇప్పుడు టీ10 ఫార్మాట్ ను పలు దేశాల్లో విస్తరించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసారు నిర్వాహకులు. తాజాగా జింబాబ్వే వేదికగా జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ పేరుతో టోర్నీ నిర్వహించనున్నారు. జూలై 20 నుండి 10 రోజుల పాటు అభిమానులను అలరించబోతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా అన్ని మ్యాచ్ లూ జరగనున్నాయి. మొత్తం ఐదు జట్లు లీగ్ లో పోటీపడనున్నాయి. బులావాయో బ్రేవ్స్ , కేప్ టౌన్ సాంప్ ఆర్మీ, డర్బన్ క్వాలాండర్స్ , హరారే హరికేన్స్ , జోహెనస్ బర్గ్ బఫేలోస్ పేరుతో ఐదు జట్లను సిద్ధం చేశారు.

ఆతిథ్య జింబాబ్వే దేశానికి చెందిన క్రికెటర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు స్టార్ క్రికెటర్లు దీనిలో ఆడనున్నారు. మోర్గాన్ , సికిందర్ రాజా, మహ్మద్ నబీ , ముష్ఫికర్ రహీమ్, ఆసిఫ్ అలీ, మహ్మద్ అమీర్, భనుక రాజపక్స, తిషార పెరీరా వంటి ప్లేయర్స్ ఉన్నారు. వీరితో పాటు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఆటగాళ్ళు రాబిన్ ఊతప్ప, శ్రీశాంత్ , యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, పార్థీవ్ పటేల్ లీగ్ లో ఆడుతున్నారు. క్రికెట్ నయా ఫార్మాట్ ను అభిమానులకు మరింత చేరువ చేసే ఉద్ధేశంతో పలు దేశాల్లో టీ10 లీగ్ లకు ప్లాన్ చేసినట్టు టీ10 స్పోర్ట్స్ ఫౌండర్ , లీగ్ ఛైర్మన్ షాజీఉల్ ముల్క్ చెప్పారు. ఆతిథ్యదేశంలో టాలెంట్ హంట్ ద్వారా పలువురు యువక్రికెటర్లకు కూడా లీగ్ లో ఆడే అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే యూఎస్ మాస్టర్స్ లీగ్ ఆరంభం కానుండగా… శ్రీలంక మాస్టర్స్ లీగ్ , ఇండియన్ మాస్టర్స్ లీగ్ లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.

Read More: Turmerci Face Mask: ముఖానికి పసుపు రాసిన తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి?

  Last Updated: 18 Jul 2023, 09:09 PM IST