Shikhar Dhawan: సూపర్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ క్రికెటర్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?

మామూలుగా అభిమాన హీరో హీరోయిన్లు అలాగే క్రికెటర్ ల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు వేసుకునే చెప్ప

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 06:00 PM IST

మామూలుగా అభిమాన హీరో హీరోయిన్లు అలాగే క్రికెటర్ ల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు వేసుకునే చెప్పుల నుంచి వారు ప్రయాణించే కారు వరకు వాటి ధరలు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు ఉద్ధరించే చెప్పులు డ్రెస్సులు వాచ్లు ప్రయాణించే కార్ లకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అలాగే స్టార్ క్రికెటర్లు వరుసగా ఒకరి తర్వాత ఒకరు లగ్జరి కార్లను కొనుగోలు చేస్తూ వార్తలు నిలుస్తున్నారు.

తాజాగా మరో స్టార్ క్రికెటర్ కూడా ఒక లగ్జరీ కార్ను కొనుగోలు చేశారు. అతను మరెవరో కాదు స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్. కాగా శిఖర్‌ ధావన్‌కు లగ్జరీ కార్లు అంటే మోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే మార్కెట్లోకి మంచి మంచి మోడల్స్ రాగానే వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శిఖర్‌ ధావన్‌ అత్యంత ఖరీదైన రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశాడు. కాగా అందుకు సంబంధించి వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్‌ చేశాడు.

Shikhar Dhawan

శిఖర్‌ ధావన్‌ కొనుగోలు చేసిన ఆ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడళ్ల ధర రూ. 3.5 కోట్ల నుండి అత్యంత ఖరీదైన వేరియంట్‌ రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ధావన్‌ కొనుగోలు చేసిన లేటెస్ట్‌ వెర్షన్ విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఎప్పటిలాగానే తనదైన స్టయిల్‌లో పంజాబీ పాటతో ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. సెలబ్రిటీలు మనసుపడుతున్న కార్లలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి. కారు ధర తెలిసి చాలామంది అభిమానులు షాక్ అవుతున్నారు.. ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ అతనికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే వీడియో పై కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.