Sri Lanka Request BCCI: బీసీసీఐకి ప్ర‌త్యేక ఆఫ‌ర్ ఇచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు!

జులై-ఆగస్టులో జరగాల్సిన శ్రీలంక ప్రీమియర్ లీగ్ (LPL) ఇప్పటికే అయోమ‌యంలో ప‌డింది. దీంతో శ్రీలంక క్రికెట్ షెడ్యూల్ ఖాళీగా ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న SLC.. BCCIతో సంప్రదింపులు జరిపింది.

Published By: HashtagU Telugu Desk
BCCI Sponsorship

BCCI Sponsorship

Sri Lanka Request BCCI: ఆగస్టు 2025లో భారత్- బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రీషెడ్యూల్ అయింది. ఇటీవలి రాజకీయ విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆగస్టులో భారత జట్టు ఎటువంటి సిరీస్ ఆడదు. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC).. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (Sri Lanka Request BCCI)కి ఒక ప్రత్యేక ఆఫర్‌ను అందించింది.

జులై-ఆగస్టులో జరగాల్సిన శ్రీలంక ప్రీమియర్ లీగ్ (LPL) ఇప్పటికే అయోమ‌యంలో ప‌డింది. దీంతో శ్రీలంక క్రికెట్ షెడ్యూల్ ఖాళీగా ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న SLC.. BCCIతో సంప్రదింపులు జరిపింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. SLC ఆగస్టు మధ్యలో ఒక చిన్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌ను హోస్ట్ చేయడానికి BCCIకి అభ్యర్థన చేసింది. BCCI ఇంకా ఆ ఆఫ‌ర్‌పై స్పందించలేదు. అయితే ఈ సిరీస్ జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Also Read: Toyota Urban Cruiser: టయోటా నుంచి మ‌రో కారు.. ధ‌ర‌, డౌన్ పేమెంట్, ఫీచర్ల వివరాలివే!

సిరీస్ ఎప్పుడు జరగవచ్చు?

శ్రీలంక ఆగస్టు చివరిలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆగస్టు 29 నుండి సిరీస్ ప్రారంభమవుతుంది. అందువల్ల భారత్- శ్రీలంక మధ్య వన్డే లేదా T20 సిరీస్‌కు ఆగస్టు మధ్య వారం అత్యంత అనుకూలమైన సమయం. రెండు దేశాల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ జులై 2023లో జరిగింది. ఇందులో భారత్ T20 సిరీస్‌ను గెలుచుకోగా, శ్రీలంక వన్డే సిరీస్‌లో విజయం సాధించింది.

రెండు జట్ల ప్రస్తుత షెడ్యూల్

భారత్

భారత జట్టు ఆగస్టు 4, 2025 వరకు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండ‌నుంది. అక్కడ ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత జట్టు తదుపరి పెద్ద టోర్నమెంట్ ఆసియా కప్. కానీ అప్పటి వరకు ఎటువంటి సిరీస్ నిర్ణయించబడలేదు. ఒకవేళ శ్రీలంకతో చర్చలు సఫలమైతే భారత జట్టు ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లవచ్చు.

శ్రీలంక

శ్రీలంక ప్రస్తుతం తమ స్వదేశంలో బంగ్లాదేశ్‌ను ఆతిథ్యం ఇస్తోంది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన శ్రీలంక.. ప్రస్తుతం జులై 10 నుండి 16 వరకు T20 సిరీస్ ఆడుతోంది.

  Last Updated: 11 Jul 2025, 05:58 PM IST