Site icon HashtagU Telugu

Shanaka Ruled Out: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. గాయం కారణంగా కీలక ఆటగాడు దూరం..!

Shanaka Ruled Out

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Shanaka Ruled Out: శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (Shanaka Ruled Out) గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నే జట్టులోకి రానున్నాడు. కుడి తొడ కండరాల గాయం కారణంగా షనక ​​శనివారం ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) విడుదల చేసిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 10న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షనక గాయపడ్డాడు. అతను కోలుకోవడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుంది. షనక స్థానంలో కరుణరత్నేను జట్టులోకి తీసుకునేందుకు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది.

టోర్నీలో శ్రీలంక తన తొలి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌తో ఓడిపోయింది. న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికాపై 429 పరుగుల ఛేజింగ్‌లో షనక 62 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇప్పుడు షనక స్థానంలో జట్టులోకి వచ్చిన కరుణరత్నే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. కరుణరత్నే ఇప్పటివరకు 23 వన్డేలు ఆడాడు. ఈ ఫార్మాట్‌లో 24 వికెట్లు పడగొట్టాడు. ఒక అర్ధ సెంచరీతో మొత్తం 443 పరుగులు చేశాడు.

Also Read: Kohli Gifts Babar Azam: బాబర్ ఆజంకు విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..!

We’re now on WhatsApp. Click to Join.

న్యూజిలాండ్ జట్టుకు షాక్

ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన న్యూజిలాండ్ జట్టుకు కేన్ విలియమ్సన్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ పరుగులు తీస్తుండగా గాయపడ్డాడు. అతని బొటన వేలికి గాయమైంది. పరుగు తీస్తుండగా ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా కివీస్ కెప్టెన్ బొటన వేలికి తగిలింది. స్కాన్‌లో అతని బొటనవేలు విరిగిందని తెలిసింది.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఎక్స్-రేలో విలియమ్సన్ ఎడమ చేతి బొటన వేలిలో ఫ్రాక్చర్ ఉన్నట్లు వెల్లడైంది. వచ్చే నెలలో కెప్టెన్ అందుబాటులోకి వస్తాడనే ఆశతో ప్రపంచకప్‌లో జట్టుతో ఉంటాడని పేర్కొంది. కోచ్ గ్యారీ స్టెడ్ ఇప్పటికీ వరల్డ్ కప్ లో విలియమ్సన్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బొటనవేలి గాయం కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అక్టోబర్‌ 18న ఆఫ్ఘానిస్తాన్, 22న భారత్‌, 28న దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌లకు విలియమ్సన్‌ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.