SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సీజన్ 19లో 10వ మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మంచి పోరు కనిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చివరి ఓవర్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పరువు కాపాడిన క్లాసెన్-నితీష్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరంభం చాలా పేలవంగా దక్కింది. జట్టు కేవలం 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 7 పరుగులు చేయగా, లియామ్ లివింగ్‌స్టోన్ 14 పరుగులు జోడించాడు. అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరగగా, కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ 41 బంతుల్లో 62 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి 33 బంతుల్లో 56 పరుగులు జోడించాడు. అయితే చివర్లో ఇన్నింగ్స్ మళ్ళీ తడబడటంతో జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో సూపర్ జెయింట్స్ తరపున మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్‌లు తలో 2 వికెట్లు తీశారు.
Also Read: ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!
రిషబ్ పంత్ ధాటికి గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా ఆశించిన ఆరంభం లభించలేదు. మిచెల్ మార్ష్ కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్ 45 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 50 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో అబ్దుల్ సమద్ 16 పరుగులు చేశాడు. దీనితో లక్నో జట్టు చివరి ఓవర్‌లో 5 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. గత సీజన్‌లో విఫలమైన పంత్ ఈసారి తన జట్టును గెలిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున హర్ష్ దూబే 2 వికెట్లు పడగొట్టాడు.
