Site icon HashtagU Telugu

IPL 2024 : SRH సిక్సర్ల జాతర..RCB టార్గెట్ 288

KKR vs SRH: Kevin Pietersen pick favourite to win IPL 2024 final

Srh Rcb 288

ఐపీల్ 2024 సీజన్ లో SRH దుమ్ములేపుతుంది. ప్రత్యర్థి జంట ఏదైనా సరే..వారికీ చెమటలు పట్టిస్తూ..SRH ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తుంది. ఈరోజు చిన్న జీయర్ స్వామి స్టేడియంలో RCB vs SRH మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన RCB కెప్టెన్ డూప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన SRH ఓపెనర్లు పరుగుల వర్షం కురిపించారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 41 బంతుల్లో 102 (8 సిక్స్‌లు, 9 ఫోర్లు) పరుగులు చేసి ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. అభిషేక్ శర్మ ..సైతం RCB బౌలర్లకు చుక్కలు చూపించాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ తోప్లే బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ధాటిగా ఆడుతున్న ట్రావీస్ హెడ్‌ 102 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. కమిన్స్ సేన. హెడ్, క్లాసెన్ సిక్స్ ల మోతతో స్టేడియం దద్దరిల్లిపోయింది. 20 ఓవర్లలో SRH 3 వికెట్లు కోల్పోయి 287 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. ఈ ఏడాదే ముంబైపై SRH 277 రన్స్ చేసి, చరిత్ర సృష్టించగా.. ఆ రికార్డును తానే తిరగరాసింది. ఈ మ్యాచ్ చూస్తున్నంత సేపు ఇది మ్యాచ్ చూస్తున్నామా..? హైలైట్స్ చూస్తున్నామా..? అనే రేంజ్ లో SRH బ్యాట్స్మెన్స్ పరుగుల వర్షం కురిపించారు. ఐపీల్ చరిత్రలో అత్యధిక స్కోర్ , అత్యధిక సిక్స్లు ఇవే కావడం విశేషం.

Read Also : Indian Student: విదేశాల్లో మరో దారుణం.. ఇండియన్ స్టూడెంట్ ను కాల్చి చంపేశారు