స్టేడియంలో సిగ‌రెట్ తాగిన జ‌ర్న‌లిస్ట్‌, వీడియో వైర‌ల్‌!

పాకిస్థాన్ లీగ్ ప్రస్తుతం పూర్తిగా వివాదాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. కేవలం సిగరెట్ వివాదం మాత్రమే కాదు, అంతకుముందు ఈ టోర్నమెంట్‌లో 'బాల్ ట్యాంపరింగ్' వంటి అపకీర్తి పనులు కూడా జరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Smoking In Match

Smoking In Match

Smoking In Match: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 (PSL 2026) ఏదో ఒక విషయంతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ టోర్నమెంట్‌లోని ఒక మ్యాచ్‌కు సంబంధించిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లైవ్ టీవీలో మరోసారి సిగరెట్ కనిపిండమే ఇందుకు కారణం. ఇంతకీ పీఎస్‌ఎల్, సిగరెట్ మధ్య చోటుచేసుకున్న తాజా వివాదం ఏంటో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి స్టాండ్స్‌లో కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. కెమెరా ఒక్కసారిగా ఆ వ్యక్తి వైపు తిరగగానే అతను కంగారుపడి అక్కడి నుండి లేచి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అలాగే సిగరెట్‌ను దాచడానికి కూడా ప్రయత్నించాడు. కానీ అప్పటికే కెమెరాలో అంతా రికార్డ్ అయిపోయింది.

Also Read: Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

సిగరెట్ తాగుతున్న ఆ వ్యక్తి ఎవరు?

సిగరెట్ తాగుతున్న వ్యక్తి పేరు ఎజాజ్ వసీం బఖ్రీ అని, అతను పాకిస్థాన్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ అని సమాచారం. సిగరెట్ వంటి వస్తువులను స్టేడియం లోపలికి ఎలా అనుమతించారనేది ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనిపై పాక్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

గతంలో ఇమాద్ వసీం కూడా..

పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కూడా గతంలో ఒకసారి పీఎస్‌ఎల్ మ్యాచ్ జరుగుతుండగా సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కారు. ఆ సమయంలో కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నది.

వివాదాల సుడిగుండంలో PSL

పాకిస్థాన్ లీగ్ ప్రస్తుతం పూర్తిగా వివాదాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. కేవలం సిగరెట్ వివాదం మాత్రమే కాదు, అంతకుముందు ఈ టోర్నమెంట్‌లో ‘బాల్ ట్యాంపరింగ్’ వంటి అపకీర్తి పనులు కూడా జరిగాయి. ఈ విషయంలో ఫకర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అంతేకాకుండా టోర్నీ ప్రారంభమైన వెంటనే బంతికి జెర్సీ రంగు అంటుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలా వరుస వివాదాలతో పీఎస్‌ఎల్ చర్చనీయాంశంగా మారింది.

  Last Updated: 02 Apr 2026, 05:52 PM IST