Site icon HashtagU Telugu

T20 Match : దురదృష్ఠం అంటే సౌతాఫ్రికాదే… గెలుపు ముంగిట మ్యాచ్ రద్దు

South Africa Imresizer

South Africa Imresizer

ప్రపంచ క్రికెట్ లో అత్యంత దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దక్షిణాఫ్రికానే. ముఖ్యంగా మెగా టోర్నీ ల్లో ఎప్పుడూ వర్షం ఆ జట్టుపై పగ పడుతూనే ఉంటుంది. 1992 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఆ టీమ్‌ వర్షం దెబ్బకు ఎలా ఇంటిదారి పట్టింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లోనూ సోమవారం జింబాబ్వేతో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చిన సమయంలో వర్షం వల్ల అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో రెండు టీమ్స్‌ చెరొక పాయింట్‌ పంచుకున్నాయి. ఈ మ్యాచ్‌కు మొదటి నుంచీ వర్షం అడ్డుపడుతూనే ఉంది. మ్యాచ్‌ రెండు గంటల 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 9 ఓవర్లలో 5 వికెట్లకు 79 రన్స్‌ చేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ వర్షం కురవడంతో సౌతాఫ్రికా టార్గెట్‌ను 7 ఓవర్లలో 64 రన్స్‌గా నిర్ణయించారు.

వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని సఫారీ ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. డికాక్ తొలి ఓవర్లో 23 రన్స్ చేశాడు. తర్వాతి ఓవర్ లోనూ అతని మరింత రెచ్చిపోవడంతో సౌతాఫ్రికా 3 ఓవర్లలోనే 51 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ 18 బాల్స్‌లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 రన్స్‌ చేశాడు. అప్పటికే సౌతాఫ్రికా డక్ వర్త్ స్కోరు కంటే ఎంతో ముందుంది. మరొక్క బాల్‌ ఆడినా కూడా మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచేదే. అయితే అదే సమయంలో భారీ వర్షం కురవడంతో మళ్లీ మ్యాచ్‌ను నిర్వహించడం సాధ్యం కాదంటూ అంపైర్లను రద్దు చేశారు.ఈ మ్యాచ్‌లో విజయంతో రెండు పాయింట్లు సులువుగా పొందే వీలున్నా.. సౌతాఫ్రికా ఇప్పుడు ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. ఇది ఆ టీమ్‌ నాకౌట్ అవకాశాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది

Exit mobile version