Site icon HashtagU Telugu

Smriti Mandhana Net Worth: ఈ మ‌హిళ క్రికెట‌ర్ సంపాద‌న ఎంతో తెలుసా.. బాగానే పోగేసిందిగా!

Smriti Mandhana Net Worth

Smriti Mandhana Net Worth

Smriti Mandhana Net Worth: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి, ‘క్వీన్ ఆఫ్ క్రికెట్’గా పిలవబడే స్మృతి మంధానా ఈ రోజు తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం స్మృతి మంధానా టీమ్ ఇండియాతో కలిసి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. అక్కడ టీమిండియా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్నారు. క్రికెట్ మైదానంలో స్మృతి మంధానా అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నారు. 2013లో స్మృతి అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. అప్పటి నుండి నిరంతరం మంధానా ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్నారు. 2018లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్మృతి మంధానాను ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా ఎంపిక చేసింది. ఈ రోజు మనం స్మృతి మంధానా మొత్తం నెట్‌వర్త్ (Smriti Mandhana Net Worth) గురించి తెలుసుకుందాం.

స్మృతి మంధానా సంపాద‌న ఎంత‌?

బీసీసీఐ స్మృతి మంధానాను గ్రేడ్ A+ కేటగిరీలో ఉంచింది. దీని కోసం ఆమెకు బీసీసీఐ నుండి ఏటా 50 లక్షల రూపాయలు లభిస్తాయి. అంతేకాకుండా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధానాను 3.40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆమెకు ఆర్సీబీ నుండి ఒప్పందంగా 3.40 కోట్ల రూపాయలు లభిస్తాయి. అలాగే స్మృతి కొన్ని బ్రాండ్‌ల ప్రకటనల నుండి కూడా ఆదాయం పొందుతుంది. రిపోర్టుల ప్రకారం.. స్మృతి మంధానా మొత్తం నెట్‌వర్త్ 32 నుండి 34 కోట్ల రూపాయలుగా అంచనా.

Also Read: Shami Wife: షమీ భార్య, కుమార్తెపై హత్యాయత్నం కేసు.. గొడవ వీడియో వైరల్!

స్మృతి మంధానా ప్రత్యేక రికార్డులు

స్మృతి మంధానా ఇప్పటివరకు మహిళల జట్టు కోసం 103 వన్డేలు, 153 టీ20లు, 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఆమె పేరిట అంతర్జాతీయ క్రికెట్‌లో 9 వేలకు పైగా పరుగులు నమోదైనాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో మంధానా 14 శతకాలు కూడా సాధించింది. స్మృతి మంధానా మహిళల క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో శతకాలు సాధించిన మొదటి భారత క్రికెటర్ కూడా. అంతేకాకుండా మహిళల వన్డే క్రికెట్‌లో టీమ్ ఇండియా తరపున అత్యధిక శతకాలు సాధించిన క్రీడాకారిణి కూడా మంధానానే. స్మృతి మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాటర్‌గా నిలిచింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించి 112 పరుగులు చేసింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక శతకాలు సాధించిన రికార్డు స్మృతి మంధానా పేరిట ఉంది. ఆమె గత సంవత్సరం 4 శతకాలు సాధించింది.