Site icon HashtagU Telugu

3rd T20I : బూమ్రా ప్లేస్‌లో హైదరాబాదీ పేసర్

Mohammed Siraj

Mohammed Siraj

సౌతాఫ్రికాతో సిరీస్‌ నుంచి స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా దూరమవడంతో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కింది. సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టీ ట్వంటీలకు బూమ్రా స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌లో నిలకడగా రాణించినప్పటకీ సిరాజ్‌ను టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ ఎంపికలో సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కోవిడ్ నుంచి కోలుకున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ సిరాజ్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. సౌతాఫ్రికాతో మిగిలిన రెండు మ్యాచ్‌లలో తుది జట్టులో సిరాజ్‌కు చోటు దక్కే అవకాశముంది.ఈ రెండు మ్యాచ్‌లలో సిరాజ్ సత్తా చాటితే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కూ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బూమ్రా కోలుకునే అవకాశాలు లేవు. అదే సమయంలో షమీ ఫిట్‌నెస్‌పైనా సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో సిరాజ్‌ను స్టాండ్ బై ప్లేయర్స్‌గా ఎంపిక చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా సఫారీలతో సిరీస్ సిరాజ్ వరల్డ్‌కప్ బెర్తులు డిసైడ్ చేయనుంది. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోన్న భారత క్రికెట్ జట్టు.. అస్సాం చేరుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన రోహిత్‌సేన గువాహటి స్టేడియంలో ఆదివారం రెండో మ్యాచ్‌ ఆడనుంది.

Exit mobile version