Shubman Gill Insta Story: రోహిత్ శర్మపై శుభ్‌మాన్ గిల్ ఇన్‌స్టా స్టోరీ వైరల్

గత కొంతకాలంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ మధ్య విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. తాజాగా గిల్ టి20 ప్రపంచ కప్ లో ఆడేందుకు అవకాశం లభించకపోవడంతో వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే తాజాగా రోహిత్ శర్మపై శుభ్‌మాన్ గిల్ తన ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర పోస్ట్ చేశాడు.

Shubman Gill Insta Story: గత కొంతకాలంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ మధ్య విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. తాజాగా గిల్ టి20 ప్రపంచ కప్ లో ఆడేందుకు అవకాశం లభించకపోవడంతో వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే తాజాగా రోహిత్ శర్మపై శుభ్‌మాన్ గిల్ తన ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర పోస్ట్ చేశాడు.

అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2024లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. రోహిత్‌, గిల్‌లు ఒకరినొకరు అన్‌ఫాలో చేశారని కూడా రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు శుభ్‌మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర కథనాన్ని పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన తర్వాత ఈ స్టార్ క్రికెటర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం అవుతుంది. గిల్ స్టోరీలో రోహిత్ శర్మ డాటర్ సమైరాతో ఉన్న ఫోటోను పంచుకుంటూ గిల్ ఇలా వ్రాశాడు. నేను మరియు సామీ రోహిత్ శర్మ నుండి క్రమశిక్షణను నేర్చుకుంటున్నాము అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

కాగా ప్రస్తుతం టీమిండియాలో శుభ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. కానీ ఇప్పుడు అతడిని విడుదల చేసి తిరిగి ఇండియాకు పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గిల్ ఈ ఇన్‌స్టాగ్రామ్ కథనాన్ని పంచుకుంటున్నట్లుగా కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు అమెరికాకు రావాలని అనుకున్నామని, అయితే వెస్టిండీస్‌కు వెళ్లే ముందు వారిలో ఇద్దరు తిరిగి భారత్‌కు వస్తారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. రాథోడ్ ప్రకటన ప్రకారం బీసీసీఐ ఇద్దరు అవేష్ మరియు శుభ్‌మాన్‌లను వెనక్కి పంపడానికి సన్నాహాలు చేసింది.

Also Read: Ram Charan : క్లీంకార కోసం నిర్మాతలకు రామ్ చరణ్ కండిషన్స్.. ఏంటో తెలుసా..?