Site icon HashtagU Telugu

Shubman Gill: గిల్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ!

Asia Cup 2025

Asia Cup 2025

Shubman Gill: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ పేరు కూడా ఉంది. ఫైనల్‌ తర్వాత గిల్‌కి (Shubman Gill) ఐసీసీ భారీ అవార్డు ఇచ్చింది. ICC అతనికి ఫిబ్రవరి నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ బిరుదును ఇచ్చింది.

ఫిబ్రవరిలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిప్స్ కూడా నామినేట్ అయ్యారు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో గిల్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఐసీసీ బహుమతిగా ఈ అవార్డు ఇచ్చింది. ఫిబ్రవరి నెలలో గిల్ 5 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీల సహాయంతో అతని బ్యాట్ నుండి 406 పరుగులు నమోదయ్యాయి.

Also Read: Handloom sector : చేనేత రంగం పై వీవింగ్ ది ఫ్యూచర్- హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు

ఫిబ్రవరిలో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అందువల్ల గిల్ ఫిబ్రవరి నెలకు నామినేట్ అయ్యాడు. అతనితో పాటు, స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యారు. కానీ గిల్.. స్మిత్, ఫిలిప్స్‌ను ఓడించి ICC ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఫిబ్రవరిలో గిల్ 5 ODI మ్యాచ్‌లలో 101.50 సగటుతో 409 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో ఆడిన మూడు వన్డేల సిరీస్‌లో అతను వరుసగా 3 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా అతను బంగ్లాదేశ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి మ్యాచ్‌లో సెంచరీ ఆడాడు.

శుభమాన్ గిల్ అద్భుతమైన కెరీర్

ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్ 32 టెస్టు మ్యాచ్‌ల్లో 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతను 55 వన్డే మ్యాచ్‌లలో 59.04 సగటుతో 2775 పరుగులు చేశాడు. 21 టీ20 మ్యాచ్‌లు ఆడి 30.42 సగటుతో 578 పరుగులు చేశాడు. వన్డేల్లో 5 సెంచరీలు.. టీ20లో 1 సెంచరీ నమోదు చేశాడు.