IND vs ENG: టెస్టుకు ముందు గాయపడిన శ్రేయాస్ అయ్యర్

టీమిండియా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ కు గాయాల బెడద తప్పడం లేదు. మొన్నటివరకు గాయాలతో సతమతమైన అయ్యర్ తాజాగా మరోసారి గాయపడ్డాడు. హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో

IND vs ENG: టీమిండియా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ కు గాయాల బెడద తప్పడం లేదు. మొన్నటివరకు గాయాలతో సతమతమైన అయ్యర్ తాజాగా మరోసారి గాయపడ్డాడు. హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో బంతి బలంగా తగలడంతో అయ్యర్ తీవ్రంగా గాయపడ్డట్లు నివేదికలు చెప్తున్నాయి.

రేపటి నుంచి టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. రేపు ఇరు జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. రెండో టెస్ట్ విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఇంగ్లిష్ ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ లో చమటోడ్చుతున్నారు. ఈ కీలక టెస్ట్ మ్యాచ్ కి కోహ్లీ దూరమయ్యాడు. దీంతో కోహ్లీ లేకుండానే టీమిండియా తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.

రేపు ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా అయ్య‌ర్ కుడి మోచేతికి బంతి బ‌లంగా త‌గిలింది. దీంతో అయ్యర్ తల్లడిల్లిపోయాడు. అయితే గాయం తీవ్రతపై జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గాయం తర్వాత ప్రాక్టీస్ కొన‌సాగించాల‌ని చూసిన‌ప్ప‌టికీ నొప్పి ఇబ్బంది పెట్ట‌డంతో అత‌డు ప‌క్క‌కు వెళ్లి కూర్చుకున్నాడు.గాయం తీవ్రత ఎక్కువైతే అయ్యారు జట్టుని వీడే ఛాన్స్ ఉంది. ఒక‌వేళ తొలి టెస్టుకు శ్రేయ‌స్ దూరం అయితే మాత్రం టీమ్ఇండియాకు అది పెద్ద ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

ఇప్ప‌టికే టీమిండియాని గాయాల బెడద వెంటాడుతుంది. ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య‌, టి20 స్పెషలిస్ట్ సూర్య‌కుమార్ యాద‌వ్‌, స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీలు గాయాల కార‌ణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఇప్పుడు శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయ‌ప‌డ్డాడు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో నిర్వహించనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. మ్యాచ్ ని పకడ్బందీగా నిర్వహించాలని హెచ్సిఏ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 వేల మంది స్కూల్‌ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాల‌కు రిప‌బ్లిక్ డే రోజున ఉచితంగా అనుమ‌తించాలని హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది.

Also Read: Tollywood Hero Revealed in Jai Hanuman : ప్రశాంత్ వర్మ ఇలా దొరికిపోతాడు అనుకోలేదు.. జై హనుమాన్ లో ఆ టాలీవుడ్ హీరో ఫిక్స్..!