Punjab Kings: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఘనవిజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19 ఓవర్లలోనే సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. పంజాబ్ 19 ఓవర్లలోనే 207 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. పంజాబ్ బ్యాటింగ్‌లో అయ్యర్ (87*), ఇంగ్లిష్ (38) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జూన్ 3న జరగబోయే ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడనుంది.
5 వికెట్లతో తేడాతో పంజాబ్ గెలుపు
ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్.. ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లో స్థానం సంపాదించింది. ఇప్పుడు ఐపీఎల్ 2025 ఫైనల్‌లో జూన్ 3న RCB- పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేసి 203 పరుగులు చేసింది. దానికి బదులుగా పంజాబ్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ రెండో సారి ఫైనల్ మ్యాచ్‌కు చేరుకుంది.
Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మరో కీలక ప్రకటన.. ఏంటంటే?
అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు 204 పరుగుల లక్ష్యం లభించింది. దానికి జవాబుగా జట్టు ఆరంభం చాలా పేలవంగా మొదలైంది. ఎందుకంటే ప్రభసిమరన్ సింగ్ కేవలం 6 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రియాంశ్ ఆర్య- జోష్ ఇంగ్లిష్ పార్టనర్‌షిప్‌ను ప్రారంభించారు. అయితే ప్రియాంశ్ 20 పరుగుల క్యామియో ఇన్నింగ్స్ ఆడి ఔట్ అయ్యాడు. పంజాబ్ 72 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. నెహల్ వఢేరా, శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూ 84 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వఢేరా 29 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 41 బంతుల్లో అజేయంగా 87 పరుగులు చేసి పంజాబ్ చారిత్రాత్మక విజయంలో పెద్ద పాత్ర పోషించాడు.