IPL: షమీని పక్కన పెట్టాల్సిందేనా?

IPL 2025 : షమిని పక్కనపెట్టి మరో యువ బౌలర్‌కు అవకాశమివ్వాలా అనే దానిపై అభిమానులు, విశ్లేషకులు మధ్య చర్చ మొదలైంది

Published By: HashtagU Telugu Desk
Shami

Shami

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు అనుకున్న స్థాయిలో విజయాలు సాధించకపోవడంలో ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా ప్రముఖ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) పేలవ ప్రదర్శన నిలిచింది. టాప్ క్లాస్ పేసర్‌గా గుర్తింపు పొందిన షమీ, ఈ సీజన్‌లో మాత్రం ఫామ్‌ కోల్పోయినట్టే కనిపిస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌ (Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో షమీ 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయారు. ఈ ప్రదర్శన అతనిపై విమర్శలు పెరగడానికి కారణమైంది.

Mahayuti Alliance : మహాయుతి కూటమిలో విభేదాలు?

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు షమీ ఆడిన 6 మ్యాచుల్లో కేవలం 5 వికెట్లే తీసుకోగలిగాడు. ఇక ఎకానమీ కూడా భారీగా పెరిగిపోవడంతో జట్టు ప్రబంధకులు అతడిపై నమ్మకం కోల్పోతున్నట్టు టాక్ ఉంది. ఒకప్పుడు మ్యాచ్ విజేతగా నిలిచే షమీ, ఇప్పుడు మాత్రం భారీ పరుగులిచ్చే బౌలర్‌గా మారిపోయాడు. ఇది SRH జట్టు స్ట్రాటజీలో గణనీయమైన మార్పుకు దారితీసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో షమిని పక్కనపెట్టి మరో యువ బౌలర్‌కు అవకాశమివ్వాలా అనే దానిపై అభిమానులు, విశ్లేషకులు మధ్య చర్చ మొదలైంది. జట్టు బ్యాలెన్స్‌ను బట్టి చూస్తే, మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఎంపిక చేయడం మెరుగైన నిర్ణయంగా భావిస్తున్నారు. షమీకి విశ్రాంతినివ్వడం, అతను మళ్లీ పూర్వ ఫామ్‌కి రావడానికి సమయం కల్పించడమో లేక అతని స్థానంలో కొత్త ప్రతిభావంతుడిని జట్టులోకి తీసుకోవడమో.. జట్టు మేనేజ్‌మెంట్ తీసుకోబోయే నిర్ణయం కీలకమవుతుంది.

  Last Updated: 13 Apr 2025, 05:02 PM IST