Site icon HashtagU Telugu

Shoaib Malik: మూడో భార్య‌కు కూడా విడాకులు?!

Shoaib Malik

Shoaib Malik

Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. తాజాగా మాలిక్ తన ప్రస్తుత భార్య, నటి సనా జావేద్‌తో కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పాల్గొన్న ఒక వైరల్ వీడియో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఆ వీడియోలో వారి ప్రవర్తన చాలా వింతగా కనిపించడంతో.. ఈ వివాహం కూడా ముగింపుకు చేరుకుందని నెటిజన్లు అనుమానిస్తున్నారు.

సనా జావేద్‌తో విడాకులు తీసుకోనున్నారా?

సానియా మీర్జాతో విడాకుల తర్వాత షోయబ్ మాలిక్ 2024 సంవత్సరంలో పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కారణంగా ఆయన అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల షోయబ్- సనా ఒక కార్యక్రమంలో పాల్గొనగా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: AP Inter Schedule: ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు!

కార్యక్రమంలో వేర్వేరుగా కనిపించిన సనా-షోయబ్

వైరల్ అవుతున్న ఆ వీడియోలో షోయబ్- సనా ఒకేచోట కూర్చున్నప్పటికీ వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదు. ఈ సమయంలో సనా ముఖంలో కోపం కూడా స్పష్టంగా కనిపించింది. దీనితో వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్లుగా నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఒక అపోహ కూడా అయ్యి ఉండవచ్చని కొంతమంది యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ పుకార్లపై షోయబ్ లేదా సనా ఎవరూ స్పందించలేదు.

సానియా తర్వాత మూడో వివాహం

సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ మూడవ వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఆయన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ తర్వాత వారి బంధంలో విభేదాలు రావడంతో 2023లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సానియా తన కుమారుడితో కలిసి జీవిస్తున్నారు.

Exit mobile version