Shoaib Malik- Sania Mirza: భారత టెన్నిస్ లో సానియా మీర్జా తెలియని అభిమాని ఉండడు.. ఆటతో పాటే గ్లామర్ తోనూ, వివాదాలతోనూ వరుస వార్తల్లో నిలిచిన సానియా పాక్ క్రికెట్ షోయబ్ మాలిక్ (Shoaib Malik- Sania Mirza)ను పెళ్లి చేసుకుంది. పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు విమర్శలు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. వీరి జోడీ వరల్డ్ బెస్ట్ స్టార్ కపుల్ గా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. 2018లో ఇజాన్ మాలిక్ కు జన్మనిచ్చిన సానియా తర్వాత భర్తతో కలిసి ఉన్న సందర్భాలు తక్కువే. దీనికి తోడు గత ఏడాదిన్నర కాలంగా సానియా-షోయబ్ జోడీ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం విడివిడిగానే ఉంటున్న వీరిద్దరూ కొడుకు ఇజాన్ కోసం దుబాయ్ లో కలుస్తున్నారు. తాజాగా ఇజాన్ మాలిక్ స్పోర్ట్స్ లో అడుగుపెట్టాడు. అందరూ అనుకున్నట్టు టెన్నిస్ , క్రికెట్ లో కాదు ఇజాన్ స్విమ్మింగ్ లో ఎంట్రీ ఇచ్చాడు. స్కూల్ స్థాయిలో తొలి విజయాన్ని కూడా అందుకున్నాడు. కొడుకు తొలి విజయాన్ని సానియా-షోయబ్ కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు. దుబాయ్ లోని ఓ ప్రైవేట్ అకాడమీలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఇజాన్ మాలిక్ రెండు మెడల్స్ గెలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సానియా-షోయబ్ తమ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఈ పోస్టులో రాసుకొచ్చారు. కాగా పాక్ కు చెందిన ఓ మోడల్ తో షోయబ్ సన్నిహితంగా ఉండడంతోనే సానియాతో విభేదాలు వచ్చాయని పలు కథనాలు వెలువడ్డాయి.
Also Read: Team India Schedule: 2024లో టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
వీరిద్దరికి సంబంధించిన పొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ వైరల్ చిత్రాల గురించి నటి అయేషా మాట్లాడుతూ.. ఇవి కేవలం ఓ వాణిజ్య ప్రకటన కోసం తీసిన చిత్రాలు అని క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుంచే వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. అయితే తమ విడాకులపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. కొడుకు ఇజాన్ పుట్టినరోజు, అప్పడప్పుడు కొన్ని పండుగల సమయాల్లో మాత్రమే సానియా,షోయబ్ కలిసి కనిపిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత సానియా తన టెన్నిస్ అకాడమీలతో బిజీగా ఉంటే.. షోయబ్ మాలిక్ విదేశీ క్రికెట్ లీగ్స్ లో ఆడుతున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.