Asian Games 2023: మూడేళ్ళ తరువాత జట్టులోకి దూబే.. ధోన్ సపోర్ట్ ?

ఎంఎస్ ధోని సపోర్ట్ తో ఎంతో మంది ఆటగాళ్లు కంబ్యాక్ అయ్యారు. ఉన్న ఆటగాళ్లు రాటుదేలుతున్నారు. అజింక్య రహానే క్రికెట్ కెరీర్ అయిపోయిందనుకున్న తరుణంలో రహానే ధోనీ సపోర్ట్ తో 2023 చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు.

Published By: HashtagU Telugu Desk
Asian Games 2023

New Web Story Copy 2023 07 15t163720.484

Asian Games 2023: ఎంఎస్ ధోని సపోర్ట్ తో ఎంతో మంది ఆటగాళ్లు కంబ్యాక్ అయ్యారు. ఉన్న ఆటగాళ్లు రాటుదేలుతున్నారు. అజింక్య రహానే క్రికెట్ కెరీర్ అయిపోయిందనుకున్న తరుణంలో రహానే ధోనీ సపోర్ట్ తో 2023 చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు. టెస్టులకే పరిమితం అనుకున్న అజింక్య రహానే పొట్టి క్రికెట్లోనూ సత్తా చాటగలడని గత ఐపీఎల్ సీజన్ ద్వారా ప్రూవ్ చేశాడు. ధోనీ సపోర్ట్ వల్లనే తాను కంబ్యాక్ అయినట్టు రహానే పలుమార్లు చెప్పాడు. రహానే మాదిరిగానే శివమ్ దూబే టీమిండియా జట్టుకు మూడేళ్లు దూరమయ్యాడు. శివమ్ దూబే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2020లో టీమ్ ఇండియా జెర్సీలో ఆడాడు. అయితే ధోనీ సపోర్ట్ తో దూబే గత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అద్భుత ప్రదర్శన చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో శివమ్ దూబే మెరుపు ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఆ సీజన్లో 16 మ్యాచ్‌లలో 158.33 స్ట్రైక్ రేట్‌తో 418 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. దీంతో శివమ్ దూబే మళ్ళీ టీమిండియా జట్టులో స్థానం దక్కింది. 2023 ఆసియా క్రీడలకు శివమ్ దూబే ఎంపికయ్యాడు.మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టబోతున్న దూబే కంబ్యాక్ వెనుక ధోనీ ఉన్నాడు. దూబే తన ఐపీఎల్ కెరీర్లో బెంగుళూరు, రాజస్థాన్, చెన్నై తరుపున ఆడాడు.

Read More: CBN Turning Point : చంద్ర‌బాబు`మ‌లుపు`కు 3డేస్

  Last Updated: 15 Jul 2023, 04:40 PM IST