Site icon HashtagU Telugu

Shah Rukh Message: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షారుక్ కీలక సందేశం

Shah Rukh Khan Message Kkr Captain Ajinkya Rahane Ipl 2025

Shah Rukh Message: ఇవాళ (మార్చి 22న) కోల్‌కతా నగరంలోని  ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) తలపడనుంది.  ఐపీఎల్ 2025లో ఓపెనింగ్ మ్యాచ్ ఇదే.  కు సిద్ధమవుతోంది.  దీనికోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో  తన టీమ్ కేకేఆర్‌లో జోష్ నింపేందుకు స్వయంగా షారుక్ ఖాన్ రంగంలోకి దిగారు. ఆయన స్వయంగా కోల్‌కతా నైట్ రైడర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి, ప్లేయర్స్ తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

షారుక్ ఖాన్ ఏమన్నారంటే..

‘‘గాడ్ బ్లెస్ యూ.. హ్యాపీగా ఉండండి.. హెల్తీగా ఉండండి.. థాంక్యూ చంద్రకాంత్ పండిత్  సార్. మీరు కోచ్‌గా టీమ్‌ను చక్కగా చూసుకుంటున్నారు. కొత్త మెంబర్స్‌కు టీమ్‌లోకి వెల్ కమ్. మాతో జాయిన్ అయినందుకు, మా కెప్టెన్ గా నిలిచినందుకు థాంక్యూ అజింక్యా. గాడ్ బ్లెస్ యూ. నీకు మంచి ఇల్లు లాంటి జట్టు దొరుకుతుందని ఆశిస్తున్నా. మా అందరితో కలిసి చక్కగా ఆడు. అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరికీ మంచి ఈవినింగ్ కావాలి. మ్యాచ్‌ను మంచిగా ఆడండి’’ అని కేకేఆర్ ప్లేయర్లు, స్టాఫ్‌ను ఉద్దేశించి షారుక్ పేర్కొన్నారు.  దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కేకేఆర్(Shah Rukh Message) టీమ్ పోస్ట్ చేసింది.

Also Read :Delimitation : ప్రధాని మోడీకి వైఎస్‌ జగన్ లేఖ

ఐపీఎల్‌లో కేకేఆర్ గురించి.. 

  • ఐపీఎల్‌లో కేకేఆర్ ఇప్పటివరకు మూడు టైటిల్స్ గెలిచింది.
  • 2024 సంవత్సరంలో ఛాంపియన్‌గా కేకేఆర్ నిలిచింది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచిన తర్వాత స్టేడియంలో షారుక్ ఖాన్ సంబరాల్లో మునిగిపోయారు.
  • ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ టీమ్ కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది.
  • గతేడాది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ టీమ్ వదులుకుంది.
  • సీనియర్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానేను కేకేఆర్ టీమ్‌లోకి  తీసుకున్న షారుక్.. ఆయనను కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు.
  • గత 17 ఏళ్లుగా ఐపీఎల్‌లో కేకేఆర్‌ టీమ్‌ను షారుక్ నడుపుతున్నారు.
  • ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లకు షారుక్ హాజరవుతున్నారు.