MI Success Secret: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతుంది. 17 సీజన్లలో ముంబై ఐదు ట్రోఫీలు గెలుచుకుంది. 6 సార్లు ఫైనల్స్‌కు చేరుకోగా, 10 సార్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. ముంబై ఈ స్థితిలో ఉండటానికి కారణం రోహిత్ శర్మ అని చెప్పడంలో సందేహమే లేదు. రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ బలమైన జట్టుగా అవతరించింది. అయితే ముంబై విజయాలకు రహస్యం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా?
2013లో ముంబైకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. మొదటి సీజన్‌లోనే జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ఆ విజయంతో మొదలైన ముంబై భవిష్యత్తు అంచలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఈ విజయాల్లో రోహిత్ స్కిల్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే వచ్చాయి. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, లసిత్ మలింగ, హర్భజన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఎందరో దిగ్గజాలు ముంబైలో ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా ముంబై ఇండియన్స్‌ను పరిశీలిస్తే టీమిండియాకు ఆడుతున్న చాలా మంది ఆటగాళ్ళు ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కేవలం ఐపీఎల్ లోనే కాకుండా టీమిండియాను ఏకం చేస్తుంది. దీంతో ముంబై సంస్కృతిని అందరూ మెచ్చుకుంటున్నారు.
యువ ఆటగాళ్లకు ముంబై మంచి ఆప్షన్ గా మారింది. ముంబై శిబిరంలో చేరి ఎంతోమంది ఆటగాళ్లు స్టార్లుగా ఎదిగారు. సాధారణ ఆటగాళ్లుగా వచ్చిన ఎందరు ప్లేయర్లు ఇప్పుడు మ్యాచ్ విన్నర్లుగా కొనసాగుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, పాండ్యా సోదరులతో సహా యువకులు ఎలా వచ్చారో మనం చూశాము. వీరంతా ఇప్పుడు టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. సహజంగానే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే తమ జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ముంబై విజయంపై బాగా ప్రభావం చూపిందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ముంబై విజయంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం హెల్దీగా ఉంటుందని సీనియర్లు చెప్తుంటారు. ఒక్కసారి ముంబై శిబిరంలో చేరిన ఏ ఒక్క ఆటగాడు జట్టును వీడాలనుకోడు. అయితే రోహిత్ కెప్టెన్సీ కోల్పోవడంతో ముంబై ఇండియన్స్ జట్టులో ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. చాలా మంది ఆటగాళ్లు ముంబై జట్టులో ఉండాలనుకోవట్లేదు. వచ్చే సీజన్ నాటికి జట్టులో భారీ మార్పులు తప్పేలా లేదు. ఏదేమైనప్పటికీ ముంబై ఇండియన్స్ ఈ పొజిషన్లో ఉండటానికి ఆ జట్టు యొక్క నిబద్దత, క్రమశిక్షణ, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా కారణం కావొచ్చు.
Also Read: Simbaa Movie : ఓటీటీలో దూసుకుపోతున్న అనసూయ ‘సింబా’..