BCCI Central Contract: ఆ యువక్రికెటర్లకు జాక్ పాట్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ

టీమిండియా యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది.. ఈ ఇద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది

BCCI Central Contract: టీమిండియా యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది.. ఈ ఇద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల మేరకు వీరిద్దరూ మూడు టెస్టులు ఆడటంతో సెంట్రల్ కాంట్రాక్ట్-సీ లిస్ట్‌లో చేర్చింది. దీని ప్రకారం ఏడాదికి కోటి రూపాయల ఫీజు లభించనుంది. కాగా ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మూడు టెస్టుల్లో అయిదు ఇన్నింగ్స్‌ల్లో 200 పరుగులు చేశాడు. ఇక వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్ కూడా ఆకట్టుకున్నాడు. మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 63 సగటుతో 190 రన్స్ చేశాడు. రాంచి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. 90, 39 నాటౌట్‌ స్కోర్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మరోవైపు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు నిరాశే మిగిలింది. వారి కాంట్రాక్ట్‌లను పునరుద్ధరించడానికి బీసీసీఐ ఆసక్తి కనబరచలేదు. రంజీట్రోఫీ ఆడకుండా తప్పించుకున్నందుకు బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ఈ కారణంతోనే సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. తర్వాత అయ్యర్ రంజీ మ్యాచ్ లు ఆడినా ఫలితం లేకపోయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ తీసుకున్న చర్యలు సరైనదేనని కొందరు అభిప్రాయపడితే…. అందరి ఆటగాళ్ల విషయంలోనూ ఇలాగే వ్యవహరించాలని మరికొందరు వ్యాఖ్యానించారు. హార్థిక్ పాండ్యా రంజీలు ఆడకుండా నేరుగా ఇప్పుడు ఐపీఎల్ ఆడడాన్ని వారంతా తప్పుపట్టారు.

Also Read:  Telangana: రేవంత్ నోరు అదుపులో పెట్టుకో…