Site icon HashtagU Telugu

Sania Mirza Marries Shami: సానియా మీర్జా- మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఫేక్ పెళ్లి ఫోటోలు క‌ల‌క‌లం..!

Sania Mirza Marries Shami

Safeimagekit Resized Img (4) 11zon

Sania Mirza Marries Shami: తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే గత ఏడాది కాలంగా సానియా, షోయబ్‌ల విడాకుల వార్తలు వ‌చ్చాయి. షోయబ్ కొత్త పెళ్లి తర్వాత సానియా పేరు భారత క్రికెటర్‌తో ముడిపడి ఉంది. నిజానికి సానియాపై అభిమానులు రెండు రకాల వాదనలు చేస్తున్నారు. ఆ వాద‌నలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి వాద‌న ఏంటంటే.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సానియా మీర్జా, భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ (Sania Mirza Marries Shami) ఉన్నారు. ఈ చిత్రంలో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో కనిపిస్తున్నారు. షోయబ్ మాలిక్ నుండి విడిపోయిన తర్వాత సానియా మీర్జా భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని పెళ్లాడిందని అంటున్నారు. అయితే ఈ వాదన పూర్తిగా ఫేక్‌. సానియా ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు. వీరిద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్న చిత్రం కూడా నకిలీదే. ఈ ఫోటో AI ఆధారితమైనదని తేలింది.

Also Read: Powerful Passports: ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన పాస్‌పోర్ట్ ఇదే.. భార‌త్ స్థానం ఎంతంటే..?

రెండవ వాదన ఏంటంటే.. సానియా త్వరలో మహమ్మద్ షమీని పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రాలన్నీ AI ఆధారితమైన‌వి. సానియా, షమీ మధ్య ఏమీ లేదు. సోషల్ మీడియాలో చేస్తున్న వాదనలు పూర్తిగా క‌ల్పితమ‌ని తెలుస్తోంది.

We’re now on WhatsApp : Click to Join