Site icon HashtagU Telugu

PAK vs BAN Test: సమోసా ధరకే మ్యాచ్ టికెట్స్ , పీసీబీపై ట్రోల్స్

PAK vs BAN Test

PAK vs BAN Test

PAK vs BAN Test: ఆగస్టు 21 నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ ఈ సిరీస్‌కు బలమైన జట్టును ప్రకటించింది, పాకిస్తాన్ కూడా తన సొంత గడ్డపై పటిష్టంగా కనిపిస్తుంది. తొలి టెస్టు ఆగస్టు 21 నుంచి 25 వరకు రావల్పిండిలో, రెండో టెస్టు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలో జరగనున్నాయి. టెస్ట్ సిరీస్ కోసం ఎక్కువ మంది ప్రేక్షకులను స్టేడియంకు రప్పించేందుకు PCB వినూత్నంగా ఆలోచించింది. కానీ పిసిబి నిర్ణయం విమర్శలపాలైంది.

బంగ్లాదేశ్ సిరీస్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ధరలను భారీగా తగ్గించడం ద్వారా పిసిబి సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది.టెస్ట్ సిరీస్ కోసం ఒక్క టికెట్ కేవలం 50 రూపాయలకే అమ్ముతుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ టికెట్ ధర కేవలం 15 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ ధరకు అమ్ముతుండటతో నెటిజన్లు పిసిబిని ట్రోల్ చేస్తున్నారు. 15కి సమోసా కూడా రాదని, అయితే పీసీబీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ప్రదర్శిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు మొన్న జరిగిన టి20ప్రపంచ కప్ సమయంలో అమెరికాలోని పిసిబి పాకిస్తాన్ ఆటగాళ్లకు కేటాయించిన బడ్జెట్ విషయంలోనూ విమర్శలపాలైంది.

వాస్తవానికి పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌ అయినా, పీఎస్‌ఎల్‌ అయినా పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌లకు ప్రేక్షకుల కొరత తీవ్రంగా కనిపించింది. ఈ కొరతను అధిగమించడానికి మరియు పాకిస్తాన్-బంగ్లాదేశ్ సిరీస్ సందర్భంగా ప్రేక్షకులను స్టేడియంకు రప్పించడానికి పిసిబి టిక్కెట్ ధరలను చాలా తక్కువ ధరకు అమ్ముతుంది. మరి ఇంత తక్కువ ధరకైనా ఫ్యాన్స్ స్టేడియానికి వస్తారా లేదా చూడాలి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌దే పైచేయి. బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌పై తొలి టెస్టు విజయం కోసం ఎదురుచూస్తోంది. ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 13 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పాకిస్థాన్ 12 విజయాలు సాధించగా, 1 టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. బంగ్లాదేశ్ పాక్ పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

Also Read: Murmu : దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం