Site icon HashtagU Telugu

Sam Konstas: విరాట్ కోహ్లీ నా ఆరాధ్య దైవం.. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ సామ్ కాన్స్టాస్‌

Sam Konstas

Sam Konstas

Sam Konstas: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్ ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో ఎన్నో మరపురాని ఘట్టాలు కనిపించినా.. ఒక్క సంఘటన మాత్రం ప్రజల మదిలో చిరకాలం నిలిచిపోతుంది. ఈ ఘటన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సామ్ కాన్స్టాస్ (Sam Konstas) మ‌ధ్య గొడ‌వ‌. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాల్గవ టెస్ట్ సందర్భంగా ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ సామ్ కాన్స్టాస్‌ను భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఢీకొన్న తర్వాత అక్క‌డ జ‌రిగిన సంభాషణను ఆసీస్ యువ ఆట‌గాడు వెల్లడించాడు. కోహ్లీని తన ఆరాధ్యదైవంగా అభివర్ణించిన కాన్స్టాస్.. చిన్నప్పటి నుంచి అతడిని చూస్తూనే పెరిగానని చెప్పాడు. తన కుటుంబం మొత్తం కోహ్లిని ఎంతో ప్రేమిస్తుంద‌ని కూడా చెప్పాడు.

బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా 19 ఏళ్ల కాన్స్టాస్- కోహ్లీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘ‌ర్ష‌ణలో కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా పడింది. ఈ టెస్టులో కాన్స్టాస్ ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసాడు. అతను ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ర్యాంప్ షాట్‌తో సహా కొన్ని అద్భుతమైన షాట్‌లను కొట్టడం ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు. అయితే కోహ్లీకి త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ గురించి కాన్స్టాస్ వెల్ల‌డించాడు.

Also Read: Tamil Nadu : విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య: సీఎం ఎంకే స్టాలిన్‌

ఫాక్స్ క్రికెట్‌కి కోడ్ స్పోర్ట్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లితో గొడవ తర్వాత కాన్స్టాస్ సంభాష‌ణ చెప్పాడు. విరాట్‌ను తన ఆరాధ్యదైవంగా భావిస్తానని, అతడికి వ్యతిరేకంగా ఆడడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. “నేను అతనిని ఎలా ఆరాధిస్తాను అనే దాని గురించి ఆట తర్వాత కొంచెం మాట్లాడాను” అని చెప్పాడు. అతనికి వ్యతిరేకంగా ఆడడం నాకు గొప్ప గౌరవ‌మని ఆసీస్ ఆటగాడు అన్నాడు.

కాన్స్టాస్ మాట్లాడుతూ.. ‘నేను అతని బ్యాటింగ్ చూసినప్పుడు భారతీయ ప్రేక్షకుల ముందు భిన్నమైన అనుభూతిని కలిగించింది. అభిమానులు ఆయన పేరును కేకలు వేశారు. ఇది అద్భుతమైన విషయం. విరాట్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అన్నాడు. తదుపరి శ్రీలంక పర్యటన కోసం విరాట్ కూడా తనకు శుభాకాంక్షలు తెలిపాడని కాన్స్టాస్ చెప్పాడు.

ఆస్ట్రేలియా U-19 ప్రపంచ కప్ 2024 విజయంలో కాన్స్టాస్ కీలక పాత్ర పోషించాడు. అతను ఏడు ఇన్నింగ్స్‌లలో 27.28 సగటుతో ఒక సెంచరీతో సహా 191 పరుగులు చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా-ఎ, ఇండియా-ఎ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా అతను పాల్గొన్నాడు.