Site icon HashtagU Telugu

Anderson Retirement: అండర్సన్ కి లెజెండ్స్ వీడ్కోలు

Anderson Retirement

Anderson Retirement

Anderson Retirement: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అండర్సన్ లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. అతడి చివరి టెస్ట్ చూడటానికి, అలాగే వీడ్కోలు పలకడానికి లార్డ్స్‌కి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. అతను ఇప్పటికే వన్డే, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు.

గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురయ్యాడు.హే జిమ్మీ మీరు 22 సంవత్సరాల అద్భుతమైన స్పెల్‌తో క్రీడా ప్రేమికులను ఆకట్టుకున్నారు. మీ బౌలింగ్ వేగం, స్వింగ్ మరియు ఫిట్‌నెస్ అద్భుతంగా ఉన్నాయి. మీరు నెక్స్ట్ జనరేషన్ కు స్ఫూర్తిని అందించారు. మీరు మంచి ఆరోగ్యం ఆనందంతో అద్భుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని సచిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆండర్సన్ రిటైర్మెంట్ పై స్పందించాడు. జిమ్మీ మీ రికార్డుని ఎవరూ టచ్ చేయలేరు. 704 టెస్ట్ వికెట్లు తీసిన ఏ ఫాస్ట్ బౌలర్‌ను నేను చూడలేదు. మీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు అంటూ సెహ్వాగ్ విషేష్ తెలిపాడు.

వీళ్ళతో పాటు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, యఙవేంద్ర చాహల్, తదితరులు ఆండర్సన్ రిటైర్మెంట్ పై తమ అభిప్రాయాలను తెలిపారు. 2003 మేలో లార్డ్స్‌లో జింబాబ్వేపై అండర్సన్ టెస్టు అరంగేట్రం చేశాడు. అతను తన కెరీర్‌లో మొత్తం 188 టెస్టులు ఆడాడు. ఈ సమయంలో అతను 350 ఇన్నింగ్స్‌లలో 704 వికెట్లను పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని సగటు 26.46 మరియు ఎకానమీ 2.79. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అంతే కాకుండా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ కూడా ఆండర్సనీ. టెస్టులో ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు, షేన్ వార్న్ 708 వికెట్లు తీశారు. ఆండర్సన్ టెస్ట్ కెరీర్‌లో 109 మంది సహచరులతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. చివరిగా శుక్రవారం వెస్టిండీస్‌పై విజయంతో టెస్ట్‌ కెరీక్‌కి వీడ్కోలు పలికాడు.

Also Read: Ambani’s Wedding: అంబానీ పెళ్లి వేడుకలో హార్దిక్ దే హవా