Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అర్జున్- సాన్యా చందోక్ నిశ్చితార్థం ఇప్పటికే జరగగా వీరి పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై స్వయంగా సచిన్ క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 10 (మంగళవారం) నాడు సచిన్ తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి అర్జున్ వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
ప్రధాని మోదీకి ఆహ్వానం
సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమారుడు అర్జున్, కుమార్తె సారా, కాబోయే కోడలు సాన్యా చందోక్‌తో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సచిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. “గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అర్జున్-సాన్యా వివాహానికి ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యువ జంటకు మీ ఆశీస్సులు, విలువైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మోదీ జీ” అని రాశారు.
Also Read: నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
#WATCH | Delhi: Cricket legend Sachin Tendulkar leaves from 10, Janpath – the residence of Congress Parliamentary Party Chairperson Sonia Gandhi. His wife, Anjali Tendulkar is also with him. pic.twitter.com/lu9CJUMq1T
— ANI (@ANI) February 10, 2026
సోనియా గాంధీతో భేటీ
ప్రధాని కంటే ముందు సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలిశారు. ఢిల్లీలోని 10 జనపథ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది.
ఎవరీ సాన్యా చందోక్?
అర్జున్ టెండూల్కర్- సాన్యా చందోక్ 2025 ఆగస్టులో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. సాన్యా ముంబైలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు. వీరి కుటుంబం దశాబ్దాలుగా భారత హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీలో పేరుగాంచింది. సాన్యా ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. ఘై కుటుంబం ఫైవ్ స్టార్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వంటి పెద్ద బ్రాండ్‌లకు యజమానులు.
సాన్యా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు మూగజీవాలంటే చాలా ఇష్టం. ముంబైలో ‘మిస్టర్ పాస్’ అనే ప్రీమియం పెట్ సెలూన్, స్పాను ఆమె నడుపుతున్నారు. సాన్యా టెండూల్కర్ కుటుంబానికి కూడా చాలా దగ్గరి వ్యక్తి. ఆమె సారా టెండూల్కర్‌కు ప్రాణస్నేహితురాలు. వీరిద్దరూ తరచుగా కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. మీడియా నివేదికల ప్రకారం.. అర్జున్-సాన్యాల వివాహ వేడుకలు మార్చి 3 నుండి ప్రారంభమవుతాయి. ప్రధాన వివాహ వేడుక మార్చి 5న జరగనుంది.
