Site icon HashtagU Telugu

world cup 2023: నా లైఫ్ మొత్తంలో బెస్ట్ ఇన్నింగ్స్ ..మ్యాక్స్ వెల్ పై సచిన్

World Cup 2023 (2)

World Cup 2023 (2)

world cup 2023: ఆఫ్ఘానిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో అద్భుతం జరిగింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఆ విజయం అంత ఈజీగా దక్కలేదు. గ్లెన్ మ్యాక్స్ వెల్ వీరోచిత పోరాట ఫలితమే. గ్లెన్ మ్యాక్స్ వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కి ఫిదా అయిన సచిన్ టెండూల్కర్ ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.నేను చూసిన బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ ఇదేనంటూ మ్యాక్స్ వెల్ పై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. త‌న అసాధార‌ణ బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాడ‌ని స‌చిన్ ట్వీట్ చేశాడు. ఓటమి అంచున ఉన్న ఆసీస్ జట్టు భారాన్ని తానొక్కడై మోసి బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించాడని అభినందించాడు. ఆఫ్ఘానిస్తాన్ బ్యాటర్ ఇబ్ర‌హీం జ‌ర్ధాన్ కూడా చ‌క్క‌టి బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్నాడ‌ని, మ్యాచ్‌లో ముప్ఫావు వంతు అప్ఘ‌నిస్థాన్ ఆధిప‌త్యం కొన‌సాగించింద‌ని, కానీ మ్యాక్స్‌వెల్ వారి గెలుపు ఆనందాన్ని దూరం చేశాడ‌ని స‌చిన్ పేర్కొన్నాడు. ఇక మ్యాక్స్ వెల్ పై వీరూభాయ్ కూడా కామెంట్స్ చేశాడు. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే అతి గొప్ప ఇన్నింగ్స్ ఇదేనని, ప్రపంచకప్ లో మ్యాక్స్‌వెల్ సాధించిన డ‌బుల్ సెంచ‌రీ చాలా కాలం పాటు క్రికెట్ అభిమానుల‌కు గుర్తుండిపోతుంద‌ని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

Also Read: world cup 2023: మ్యాక్స్‌వెల్ ఆడుతున్న సమయంలో 2.6 కోట్ల వ్యూవర్‌షిప్