Dawood Ibrahim: రంగంలోకి దావూద్ గ్యాంగ్.. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ !

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బుకీలు దుబాయ్‌లో(Dawood Ibrahim) రంగంలోకి దిగారని సమాచారం.

Published By: HashtagU Telugu Desk
India Vs Nz Champions Trophy Final Rs 5000 Crore Bets Dawood Ibrahim D Company

Dawood Ibrahim: ఇవాళ (ఆదివారం) దుబాయ్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఆతిథ్య దేశమైన పాకిస్థాన్‌కు జట్టును పంపడానికి భారత్ నిరాకరించింది. దీంతో ఈ మ్యాచ్‌ను దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కీలకమైన మ్యాచ్‌పై  రూ.5,000 కోట్ల వరకు పందాలు జరిగాయని అంటున్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘డీ కంపెనీ’ ఈ మ్యాచ్‌లపై పెద్దఎత్తున బెట్టింగ్‌లను నిర్వహిస్తోందని ప్రచారం నడుస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బుకీలు దుబాయ్‌లో(Dawood Ibrahim) రంగంలోకి దిగారని సమాచారం. ఈనేపథ్యంలో భారత్‌లోని ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ విభాగం ఐదుగురు పెద్ద బుకీలను అరెస్టు చేసింది. వారు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్స్‌పై  పందెం కాశారని దర్యాప్తులో తేలింది. అరెస్టయిన వారిలో ముగ్గురికి (మనీష్ సహాని, యోగేష్ కుకేజా, సూరజ్)  దుబాయ్‌‌లోని బెట్టింగ్ మాఫియా నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయి. వారి నుంచి పోలీసులు రూ.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు ప్రధాన నిర్వాహకుడు మనీష్ సహానీ. బెట్టింగ్‌లో పాల్గొనే వ్యక్తుల గొంతులను అతను రికార్డ్ చేసేవాడు. వారి బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలను నిర్వహించేవాడు. ఈ సమాచారాన్ని దుబాయ్ పోలీసులకు భారత్ చేరవేసింది.

Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

ప్రతీ లావాదేవీపై 3 శాతాన్ని కమీషన్‌

ఇక భారత్ – ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్‌ కాసినందుకు పర్వీన్ కొచ్చర్, సంజయ్ కుమార్ అనే ఇద్దరు బుకీలను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. లక్కీ.కామ్ అనే బెట్టింగ్ వెబ్‌సైట్ నుంచి మాస్టర్ ఐడీని కొని పర్వీన్ కొచ్చర్ , దానితో బెట్టింగ్ ఐడీలను క్రియేట్ చేస్తున్నట్లు తేలింది. ఈ ఐడీలను అతడు పంటర్లకు విక్రయించినట్లు వెల్లడైంది. ప్రతీ లావాదేవీపై 3 శాతాన్ని సిండికేట్ కమీషన్‌గా వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. ఆఫ్‌లైన్ బెట్టింగ్ కోసం, నిందితులు ఫోన్ కాల్స్ చేసేవారట. ఈక్రమంలో బెట్టింగ్ రేట్లను ఒక నోట్‌ప్యాడ్‌లో రాసి పెట్టుకునే వారని తేలింది. గత రెండు సంవత్సరాలుగా బెట్టింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న పర్వీన్ కొచ్చర్, ఈ కార్యకలాపాలను సీక్రెట్‌గా చేయడానికి నెలకు రూ.35వేలు చొప్పున చెల్లించి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడట. ప్రతీ మ్యాచ్ రోజున తనకు రూ.40వేల దాకా లాభం వచ్చిందని పోలీసులకు పర్వీన్ కొచ్చర్ తెలిపాడు. క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబంధించిన మొత్తం బెట్టింగ్ నెట్‌వర్క్ దుబాయ్ నుంచే కంట్రోల్ అవుతుందన్నాడు.

భారత జట్టు చివరిసారిగా 2013లో ఇంగ్లాండ్‌లో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2017 లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్  ఓడిపోయింది. ఈ టోర్నమెంట్‌లో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్‌కు చేరుకుంది.

  Last Updated: 09 Mar 2025, 11:49 AM IST