Site icon HashtagU Telugu

India’s Probable XI: ఆసీస్‌తో ఐదో టెస్టు.. ఈ ఇద్దరు ఆటగాళ్లపై వేటు?

India's Probable XI

India's Probable XI

India’s Probable XI: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జనవరి 3 నుంచి సిడ్నీలో ఐదో మ్యాచ్ జరగనుంది. డబ్ల్యూటీసీ పరంగా ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు (India’s Probable XI) చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ ఇండియా WTC రేసులో కొనసాగుతుంది. 2025లో టీమిండియాకు సిడ్నీ టెస్టు తొలి టెస్టు మ్యాచ్ కానుంది. ఇప్పుడు టీమిండియా కీల‌క‌ ఆటగాడు కొత్త ఏడాది తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవ‌కాశం ఉంది. ఇప్పటివరకు ఈ ఆటగాడు సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడుతూ కనిపించాడు.

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు సిరాజ్ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో ఆడాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ 4 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టినప్పటికీ మ్యాచ్ సమయంలో జస్ప్రీత్ బుమ్రాకు సిరాజ్ నుండి తగినంత మద్దతు లభించలేదు. దీంతో సిడ్నీ టెస్టుకు సిరాజ్ దూర‌మ‌య్యే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉంది.

Also Read: Chandrababu : నూతన సంవత్సర తొలిరోజున దాదాపు 2 వేల మందిని కలిసిన సీఎం చంద్రబాబు

సిడ్నీ టెస్టు నుంచి మహ్మద్ సిరాజ్‌ను తప్పించినట్లయితే అతని స్థానంలో ప్రసిద్ కృష్ణకు అవకాశం లభించవచ్చు. ఇప్పటి వరకు ప్రసిద్ధ్ కృష్ణకు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు 2025లో జరిగే తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రసిద్‌కు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌కు ముందు ఇండియా ఎ, ఆస్ట్రేలియా ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రసిద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రసిద్ రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 10 వికెట్లు పడగొట్టాడు.

రిషబ్‌ పంత్‌పై వేటు?

బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఐదో టెస్టు సిడ్నీ వేదిక‌గా జ‌న‌వ‌రి 3న ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు ముందు టీమిండియాలో మార్పులు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న రిష‌బ్ పంత్‌ను ఐదో టెస్టుకు ప‌క్క‌న పెట్ట‌నున్నారు. పంత్‌ను పక్కన పెట్టి ధ్రువ్‌ జురెల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.