చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో జరిగిన తాజా మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుతంగా రాణించాడు. 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. ఈ ఆట తీరు ద్వారా ఆయన ఐపీఎల్‌లో 20వసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును (POTM) సాధించారు. ఈ రికార్డుతో భారత ఆటగాళ్లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(Man of the Match Award)లు పొందిన ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ (25), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (22) ముందు వరుసలో ఉన్నారు. రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ (19) నాలుగో స్థానంలో ఉన్నారు.
Office : మీరు ఆఫీసులో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా..? అయితే ఇలా చెయ్యండి
ఈ మ్యాచ్‌లో అరుదైన మరొక రికార్డును రోహిత్ అందుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధవన్‌ను (6,769) వెనక్కు నెట్టి 6,786 పరుగులతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ 8,326 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. హిట్‌మ్యాన్ అంచనాలకు మించి మెరుస్తూ, బౌలర్లపై తన సత్తా చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ మంచి ఆటగాడిగానే కాకుండా, సీనియర్‌గా తన పాత్రను బాగా నిర్వర్తిస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో జట్టును నడిపించే తీరు, ఒత్తిడిని ఎదుర్కొంటూ జట్టుకు విజయాల బాటలో తోడ్పడటం ఆయన ప్రత్యేకత చాటుకుంటున్నారని కొనియాడుతున్నారు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ రోహిత్ ఇలాగే రాణిస్తే, మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయని స్పోర్ట్స్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.