Rohit Sharma: ఐపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్ (MI)- కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ పోటీలో అనేక దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు తమ ముద్ర వేశారు. కానీ కొందరు ఆటగాళ్లు MI vs KKR మ్యాచ్‌లలో రన్స్ కుమ్మరించి చరిత్ర సృష్టించారు. అలాంటి ఒక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, KKRపై అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. రోహిత్ IPLలో KKRపై 954 రన్స్ చేశాడు. IPL 2025లో మొదటి రెండు మ్యాచ్‌లలో రోహిత్ బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయాడు. కానీ వాంఖడే స్టేడియంలో మూడో మ్యాచ్‌లో KKRతో తలపడేందుకు ముంబై దిగుతున్నప్పుడు.. అతనికి చారిత్రక రికార్డు సాధించే అద్భుత అవకాశం ఉంది.
1000 పరగుల క్లబ్‌కు చేరువలో రోహిత్
రోహిత్ శర్మ MI vs KKR మ్యాచ్‌లలో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్. ఈడెన్ గార్డన్స్‌లోనైనా.. వాంఖడేలోనైనా రోహిత్ KKRపై IPL మ్యాచ్‌లలో ఎన్నోసార్లు తన బ్యాట్‌తో మ్యాజిక్ చేశాడు. MI vs KKR మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి 954 రన్స్ వచ్చాయి. స్ట్రైక్ రేట్ 128.05తో బ్యాటింగ్ చేశాడు. ఈ రోజు మ్యాచ్‌లో రోహిత్ 46 రన్స్ చేస్తే 1000 రన్స్ పూర్తి చేసి ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. హిట్‌మ్యాన్ ఈ పెద్ద మైలురాయిని చేరుకోగలడా లేదా అనేది చూడడం ఆసక్తికరంగా ఉంటుంది.
Also Read: Malaika Arora Dating: క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్న మలైకా అరోరా? ఐపీఎల్ మ్యాచ్ ఫోటోలు వైరల్!
MI vs KKRలో అత్యధిక రన్స్
- 954 – రోహిత్ శర్మ (128.05 SR)
- 590 – సూర్యకుమార్ యాదవ్ (149.74 SR)
- 362 – వెంకటేష్ అయ్యర్ (165.29 SR)
- 349 – గౌతమ్ గంభీర్ (115.94 SR)
- 327 – మనీష్ పాండే (135.12 SR)
MIకి మొదటి విజయం కోసం ఎదురుచూపు
IPL 2025లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 8 రన్స్‌కే ఔటయ్యాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో MI అభిమానులు రోహిత్ నుంచి మెరుగైన బ్యాటింగ్‌ను ఆశిస్తున్నారు. తద్వారా ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని సాధించాలని చూస్తోంది. IPL 2025 పాయింట్స్ టేబుల్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు విజయం సాధించని ఏకైక జట్టుగా ఉంది. దీని కారణంగా జట్టు టేబుల్‌లో అట్టడుగు స్థానంలో ఉంది.