Rohit- Kohli Angry: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్‌లో కంగారూ బ్యాట్స్‌మెన్‌ను భారత స్పిన్నర్లు నిలువరించారు. స్టీవ్ స్మిత్ మినహా మిగిలిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ భారత స్పిన్నర్లపై పరుగుల కోసం కష్టపడుతున్నారు. అయితే, ముఖ్యమైన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ బంతితో ఫామ్‌లో కనిపించలేదు. కుల్‌దీప్‌కి ఎలాంటి వికెట్ దక్కలేదు. బంతితో అద్భుతాలు చేయలేని కుల్దీప్.. మైదానంలో కూడా చురుకుగా కనిపించలేదు. మైదానం మధ్యలో కుల్దీప్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కోపానికి (Rohit- Kohli Angry) గురయ్యాడు.
కుల్దీప్ నిర్లక్ష్యంపై కోహ్లి-రోహిత్ ఆగ్రహం
అసలేం జరిగిందంటే.. కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని స్టీవ్ స్మిత్ బౌండరీ లైన్ వైపు షాట్ ఆడాడు. బౌండరీపై నిలబడిన విరాట్ కోహ్లి విపరీతమైన చురుకుదనాన్ని ప్రదర్శించి బంతిపైకి దూసుకెళ్లి వేగంగా బంతిని కుల్దీప్ వైపు విసిరాడు. కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ కారణంగా కంగారూ బ్యాట్స్‌మెన్ రెండో పరుగు తీసుకోవాలనే ఆలోచనను విరమించుకున్నారు. అయితే, కోహ్లీ బంతిని విసిరినప్పుడు, బౌలింగ్ ఎండ్‌లో నిలబడిన కుల్దీప్.. బంతిని పట్టుకోకుండా బాల్‌ను వదిలేశాడు.
Also Read: Telangana TDP: టీడీపీలోకి తీన్మార్ మల్లన్న.. ? టార్గెట్ జీహెచ్‌ఎంసీ పోల్స్ !
Chuldeep😭😭 https://t.co/KNa6yFug5e pic.twitter.com/fHfGsRl8iD
— S A K T H I ! (@Classic82atMCG_) March 4, 2025
కుల్దీప్ చేసిన ఈ చర్యతో కోహ్లి చాలా సిరీయస్ అయ్యాడు. కోహ్లీ బౌండరీ లైన్ నుండే భారత స్పిన్నర్‌పై కోపం చూపటం కనిపించింది. అదే సమయంలో బంతిని పట్టిన కెప్టెన్ రోహిత్ కూడా కుల్దీప్ కు గట్టి క్లాస్ పీకాడు. కోహ్లి-రోహిత్‌ల కోపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షమీ-జడేజా రాణించారు
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తమ బౌలింగ్‌తో రాణించాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు షమీ అద్భుతమైన శుభారంభం అందించి ఖాతా తెరవకుండానే కూపర్‌ను పెవిలియన్ బాట పట్టేలా చేశాడు. అదే సమయంలో రెండవ స్పెల్‌లో కంగారూ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగుల బలమైన ఇన్నింగ్స్‌ను కూడా షమీ ముగించాడు. మరోవైపు జడేజా స్పిన్ మాయాజాలం కూడా కనిపించింది. జడ్డూ కేవలం 29 పరుగుల వద్ద మార్నస్ లాబుషాగ్నేను అవుట్ చేశాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్‌ను కూడా జడ్డూ పెవిలియన్‌కు పంపాడు.