Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఐదో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయిన వెంటనే.. అవాంఛిత రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్‌పై (Rohit Sharma) నమోదైంది. 12వ సారి టాస్ కోల్పోయిన భారత్ వరుసగా అత్యధిక సార్లు టాస్ కోల్పోయిన దేశంగా మారింది. ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ పేరిట ఉంది. ఇది మార్చి 2011- ఆగస్టు 2013 మధ్య వరుసగా 11 సార్లు టాస్‌ను కోల్పోయింది.
ఫిబ్రవరి 23న దుబాయ్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తరపున మహ్మద్ షమీ తొలి ఓవర్ వేశాడు. అయితే అతను 6 బంతుల బదులు 11 బంతులు వేయాల్సి వచ్చింది. నిజానికి షమీ తొలి ఓవర్‌లోనే 5 వైడ్ బాల్స్ వేశాడు. అందువల్ల అతను 6 బంతులకు బదులుగా 11 బంతులు వేయవలసి వచ్చింది.
Also Read: Raja Rithvik : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రిత్విక్‌కు కాంస్యం.. నేపథ్యం ఇదీ..
భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. అయితే, మహమ్మద్ షమీ గాయపడి ఫీల్డ్‌కు దూరంగా ఉండటంతో ఓపెనింగ్‌లోనే భారత్‌కు పెద్ద దెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ ఇలా ఫీల్డ్ ఔట్ కావడం ఆందోళన కలిగించే అంశం.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
పాకిస్థాన్: ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్/కెప్టెన్), సల్మాన్ అగా, తయ్యిబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.