WI vs IND 2023: వెస్టిండీస్ పర్యటనలో రోహిత్ కు విశ్రాంతి?

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లోనూ సత్తా చాటలేకపోయాడు. ఇక తాజాగా రోహిత్ సారధ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా పరాజయం పాలైంది

Published By: HashtagU Telugu Desk
WI vs IND 2023

New Web Story Copy (94)

WI vs IND 2023: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లోనూ సత్తా చాటలేకపోయాడు. ఇక తాజాగా రోహిత్ సారధ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా పరాజయం పాలైంది. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు సిద్ధపడుతుంది. జూన్ 27న బెంగుళూరులో దులీప్ ట్రోఫీ ప్రారంభం కావడానికి ముందు వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. సమాచారం మేరకు జూలై 12న డొమినికాలో వెస్టిండీస్ తో తొలి టెస్టుతో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో టెస్టు ట్రినిడాడ్‌లో జరగనుంది.

ఐపీఎల్, ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వరుస సిరీస్ లతో కెప్టెన్ రోహిత్ అలసిపోనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనలో కొన్ని మ్యాచ్‌ల తరువాత రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. దీనిపై సెలక్టర్లు రోహిత్‌తో మాట్లాడిన తరువాత నిర్ణయం ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో రోహిత్‌కు విశ్రాంతినిస్తే ఈ పర్యటనకు అజింక్యా రహానే స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. WTC ఫైనల్‌లో అజింక్య రహానే 89 మరియు 46 స్కోరుతో అద్భుతంగా పునరాగమనం చేశాడు. రోహిత్ తో పాటు టెస్టు సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు కూడా విశ్రాంతి ఇవ్వవచ్చు.

కాగా.. ఐపీఎల్ 2023లో రోహిత్ 16 మ్యాచ్‌లలో 20.75 సగటుతో రెండు అర్ధ సెంచరీలతో కేవలం 332 పరుగులు చేశాడు. దీనితో పాటు ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 15 మరియు రెండవ ఇన్నింగ్స్‌లో 43 పరుగుల వద్ద ఔటయ్యాడు.

Read More: Facebook: ఫేస్ బుక్ అకౌంట్ లాక్ పై కోర్టుని ఆశ్రయించిన వ్యక్తి.. రూ.41 లక్షల పరిహారం?

  Last Updated: 16 Jun 2023, 05:36 PM IST