Suryakumar Yadav Catch: సూర్య క్యాచ్ పట్టకపోయి ఉంటే.. రోహిత్ ఫన్నీ కామెంట్స్

టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పై రోహిత్ శర్మ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఒకవేళ సూర్య క్యాచ్ మిస్ చేసి ఉంటె నేను అతనిని బెంచ్ కే పరిమితం చేసి ఉండేవాడిని అంటూ నవ్వుతూ చెప్పాడు.

Published By: HashtagU Telugu Desk
Suryakumar Yadav Catch

Suryakumar Yadav Catch

Suryakumar Yadav Catch: క్యాచేస్ విన్ మ్యాచెస్. ఒక మ్యాచ్ గెలుపులో బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో బౌలర్లు చేతులెత్తేసినప్పుడు ఫీల్డిండ్ ద్వారా గెలిచిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయ్. తాజాగా జరిగిన టి20 ప్రపంచకప్(T20 World Cup) ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ (Catch) ఎప్పటికీ మర్చిపోలేం.

17 ఏళ్ళ నాటి కళను నిరవేర్చుకునేందుకు సమయం వచ్చిన వేళ క్రీజులో డేంజరస్ బ్యాట్స్ మెన్లు ఉన్నారు. టార్గెట్ ఏమంత కష్టమైంది కూడా కాదు. ఆల్మోస్ట్ మ్యాచ్ చేజారే సందర్భం.క్రీజులో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. హార్దిక్ బంతి విసరాగా మిల్లర్ కిల్లింగ్ షాట్ బాదాడు. బంతి గాల్లోకి లేవగానే మ్యాచ్ ఓడిపోయామాన్న బాధ ప్రతి ఒక్కరిలో కనిపించింది. కానీ ఎటువైపు నుంచి వచ్చాడో గానీ బలాన్ని కూడగట్టుకుని బంతి వైపు పరుగెత్తాడు సూర్య. బంతి ఆల్మోస్ట్ బౌండరీ అవతల పడినంత పనైంది. కానీ సూర్య కుమార్ చాకచక్యంగా బంతిని అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోయాడు. వెంటనే బంతిని గాల్లోకి ఎగురేసి మాల్లి తాను మైదానంలోకి వచ్చి బంతిని ఒడిసిపట్టుకున్నాడు.

140 కోట్ల మంది భారతీయులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మైదానంలో సంబరాలు మొదలయ్యాయి. ఆటగాళ్లలో కళ్ళలో గెలుస్తున్నామన్నా ఆశ. కానీ క్రీజులో రాబడా ఉన్నాడు. అయితే హార్దిక్ రాబడని క్యాచ్ అవుట్ చేసి టీమిండియాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. కాగ సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ గురించి తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యక్తలు చేశాడు. బంతి సూర్య చేతిలో కూర్చోవడం బాగుంది, లేకపోతే నేను సూర్యను కూర్చోబెట్టేవాడిని ఆంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. రోహిత్ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజాన్లు కూడా ఫన్నీగానే స్పందిస్తున్నారు.

Also Read: Hyderabad Tourists Died : విరిగిపడ్డ కొండచరియలు.. హైదరాబాద్ టూరిస్టుల మృతి

  Last Updated: 06 Jul 2024, 05:25 PM IST