Site icon HashtagU Telugu

Rohit Sharma : రోహిత్ కు కోపమొచ్చింది.. అంపైర్ నిర్ణయంపై అసహనం

Rohith

Rohith

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తీవ్ర అసహనానికి లోనయ్యాడు. నాలుగో రోజు ఆటలో థర్డ్‌ అంపైర్‌ వ్యవహరించిన విధానానికి ఫీల్డ్‌ అంపైర్‌ను అడ్డగించాడు. టీమిండియా విజయానికి మూడు వికెట్ల దూరంలో ఉన్న సమయంలో.. ఇంగ్లండ్‌ టెయిలెండర్‌ టామ్‌ హార్లీని అవుట్‌ చేసే అవకాశం వచ్చింది. అశ్విన్‌ బౌలింగ్‌లో టామ్‌ హార్లీ రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ చేతికి బంతి చిక్కింది. దీంతో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ హార్లీని అవుట్‌గా ప్రకటించాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఎనిమిదో వికెట్‌ కూడా పడిందన్న సంబరంలో టీమిండియా ఉండగా.. హార్లీ రివ్యూకు వెళ్లాడు. ఈ క్రమంలో బాల్‌ ట్రాకింగ్‌లో.. బంతి తొలుత హార్లీ ముంజేతిని తాకి బ్యాట్‌కు తాకినట్లు కనిపించడంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చారు. అయితే, ఎల్బీకి అప్పీలు చేయకపోయినా.. లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ను థర్డ్‌ అంపైర్‌ ట్రాక్‌ చేసి.. అంపైర్స్‌ కాల్‌ ప్రకారం నాటౌట్‌ అని ప్రకటించింది.దీంతో గందరగోళం నెలకొంది. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై భారత సారథి రోహిత్‌ శర్మ సహా అశ్విన్‌ విస్మయం చేస్తూ.. అంపైర్స్‌ కాల్‌ ప్రకారం ఇది అవుటే కదా.. నాటౌట్‌ ఎలా ఇస్తారు? అని మైదానంలో ఉన్న అంపైర్‌తో వాదనకు దిగారు. స్పిప్స్‌లో క్యాచ్‌ పట్టుకున్నపుడు అవుట్‌ ఇచ్చాననీ,. ఎల్బీడబ్ల్యూకు కాదుఎంని రోహిత్‌ సేనకు సదరు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ బదులిచ్చాడు. ఏదేమైనా ఈ విషయంలో టీమిండియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది . ఈ హైడ్రామాకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

Read Also : Prabhas Kalki : కల్కిలో హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఎక్కువే.. ఆ స్టార్ హీరోయిన్ సర్ ప్రైజ్ క్యామియో..!

Exit mobile version