Site icon HashtagU Telugu

Rohit Sharma: వన్డేల్లో వేగంగా 9 వేల పరుగులు చేసిన టాప్- 5 ఓపెనర్లు వీరే.. టాప్‌లో రోహిత్ శ‌ర్మ‌!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: వన్డేల్లో ఓపెనర్‌గా వేగంగా (ఇన్నింగ్స్ పరంగా) 9 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ (Rohit Sharma) రికార్డు సృష్టించాడు. గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక‌పోతే వన్డేల్లో వేగంగా 9 వేల పరుగులు చేసిన టాప్ 5 ఓపెనర్ల గురించి ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. నిజానికి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా వన్డేల్లో 9 వేల పరుగులను దాటిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తొలి పరుగుతో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

రోహిత్ శర్మ

ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ 15 బంతుల్లో 20 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. రోహిత్ తన చిన్న ఇన్నింగ్స్‌లో అద్భుతమైన రికార్డు సృష్టించాడు. ఓపెనర్‌గా వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగులు చేసిన (ఇన్నింగ్స్ పరంగా) ఆటగాడిగా నిలిచాడు. అతను కేవలం 181 వన్డే ఇన్నింగ్స్‌లో ఈ సంఖ్యను తాకాడు.

Also Read: Virat Kohli Century: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భార‌త్‌.. సెంచ‌రీతో చెల‌రేగిన కోహ్లీ!

సచిన్ టెండూల్కర్

గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను రోహిత్ రెండో స్థానానికి నెట్టాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా సచిన్ 197 ఇన్నింగ్స్‌ల్లో 9 వేల వన్డే పరుగులు పూర్తి చేశాడు.

సౌరవ్ గంగూలీ

ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో నిలిచాడు. గంగూలీ ఓపెనర్‌గా 231 వన్డే ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేశాడు.

క్రిస్ గేల్

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. గేల్ 246 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 9 వేల పరుగులను అధిగమించాడు.

ఆడమ్ గిల్‌క్రిస్ట్

ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. గిల్‌క్రిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా 253 వన్డే ఇన్నింగ్స్‌లలో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేశాడు.

వన్డేల్లో 9000 పరుగులు చేసిన ఓపెన‌ర్ల జాబితా