Rohit Sharma: భారత క్రికెట్ జట్టులో అనేక కీలక మార్పులు చోటుచేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో ఇప్పుడు శుభమన్ గిల్‌ను కెప్టెన్‌గా చేశారు. గత కొన్ని నెలల్లో రోహిత్ శర్మ టెస్టు, వన్డే ఫార్మాట్‌ల కెప్టెన్సీ రెండూ చేజారిపోయాయి. హిట్‌మ్యాన్ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో కేవలం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడనున్నారు. అయితే ఈ ఏడాడి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు రోహిత్, కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా రంజీ ట్రోఫీ కోసం జట్లను కూడా ప్రకటిస్తున్నారు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ కోసం తాజాగా జమ్మూ కశ్మీర్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రోహిత్ శర్మ పేరు కూడా కనిపించింది.
Also Read: Landslide: కొండచరియలు విరిగిపడి బస్సు ధ్వంసం.. 8 మంది దుర్మరణం!
రోహిత్ శర్మకు అవకాశం
రంజీ ట్రోఫీ 2025 కోసం జమ్మూ కశ్మీర్ జట్టును ప్రకటించినప్పుడు అందులో రోహిత్ శర్మ పేరు కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. జమ్మూ జట్టు తమ తొలి మ్యాచ్‌ను ముంబైతో ఆడనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మైదానంలో కనిపిస్తాడని భావించారు. హిట్‌మ్యాన్ టెస్ట్ క్రికెట్ నుంచి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రంజీ ట్రోఫీ ఆడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ వార్తలో నిజం బయటపడింది. ఈ రోహిత్ శర్మ భారత జట్టుకు చెందిన దిగ్గజ బ్యాట్స్‌మెన్ కాదు. ఈయన జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఒక బౌలర్. ఈ రంజీ ట్రోఫీలో తన బౌలింగ్‌తో అద్భుతాలు సృష్టించగలరు. కాగా హిట్‌మ్యాన్ (భారత జట్టు రోహిత్ శర్మ) విజయ్ హజారే ట్రోఫీలో ఆడే అవకాశం ఉంది.
జమ్మూ కశ్మీర్‌కు చెందిన రోహిత్ శర్మ ఎవరు?
జమ్మూ కశ్మీర్ ఆటగాడు రోహిత్ శర్మ సెప్టెంబర్ 5, 1994న జన్మించారు. రోహిత్ 2015లో జమ్మూ కశ్మీర్ తరఫున అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి అతను జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున మూడు ఫార్మాట్‌లలోనూ ఆడుతూ కనిపిస్తున్నారు. ఈ రంజీ జట్టులో రోహిత్ శర్మకు తోడుగా ఆకిబ్ నబీ, ఉమర్ నజీర్, ఉమ్రాన్ మాలిక్ కూడా ఉన్నారు. దీని కారణంగానే ఈ జట్టు బౌలింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. గతంలో జమ్మూ కశ్మీర్ జట్టు ముంబైపై అద్భుత ప్రదర్శన చేసింది.
