Site icon HashtagU Telugu

Rohit- Kohli: అంతర్జాతీయ క్రికెట్‌కు రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ కోహ్లీ, రోహిత్!

Australia Series

Australia Series

Rohit- Kohli: భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ (Rohit- Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంపై కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఇదే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లో మళ్లీ కనిపించనున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం బీసీసీఐ అక్టోబర్ 4న భారత జట్టు స్క్వాడ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు ఏ మ్యాచ్ ఆడలేదు. అయినప్పటికీ ఈ వన్డే సిరీస్‌కు వారి ఎంపిక దాదాపుగా ఖాయమైంది. అయితే స్క్వాడ్‌ను ప్రకటించే తేదీ వాయిదా పడే అవకాశం కూడా ఉంది.

కొత్త కెప్టెన్లు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అదేవిధంగా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు వారు టెస్ట్ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికారు. వారి రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టు పగ్గాలు సూర్యకుమార్ యాదవ్ చేతికి వెళ్లగా, శుభమన్ గిల్ కొత్త టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19 నుండి నవంబర్ 8 వరకు జరగనుంది. మొదట 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది.

Also Read: AP Inter Schedule: ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు!

రోహిత్ కెప్టెన్సీ, హార్దిక్-పంత్‌ల‌కు విశ్రాంతి

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. విరాట్ కోహ్లి ఎంపిక కూడా దాదాపు ఖాయం. గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడడం లేదు. అయితే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను జట్టు నుండి తప్పించవచ్చు అనే ఊహాగానాలు గత కొన్ని వారాలుగా వినిపిస్తున్నాయి. ఇవి ప్రస్తుతానికి పుకార్లు మాత్రమే అయినప్పటికీ కొంతమంది సెలెక్టర్లు మాత్రం రోహిత్, విరాట్‌లు 2027 ప్రపంచకప్ వరకు జట్టులో ఉండకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై త్వరలోనే చర్చ జరిగే అవకాశం ఉంది.

Exit mobile version