Site icon HashtagU Telugu

Riyan Parag: వైరల్ అవుతున్న రియాన్ పరాగ్ యూట్యూబ్ హిస్టరీ.. హీరోయిన్ల హాట్

Riyan Parag

Riyan Parag

Riyan Parag: గత సీజన్ ఐపీఎల్ లో విమర్శలు ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేశాడు. మిడిల్ అర్దర్లో జట్టుని ఆడుకుంటూ స్కోరు బోర్డుకు అవసరమైన పరుగులు సాధించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అనేక మ్యాచ్‌లలో పరాగ్ ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్‌ను విజయానికి నడిపించాడు. క్వాలిఫైయర్-2కి చేరుకోవడంలో పరాగ్ కీలక పాత్ర పోషించాడు.

రియాన్ పరాగ్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ బయటకు వచ్చింది. తన యూట్యూబ్ ఛానెల్ లో సెర్చ్ చేస్తున్న క్రమంలో కింద కొందరి హీరోయిన్ల హాట్ ఫోటోలు, వీడియోలు వెతికినట్లు సజెస్ట్ అయింది. ఈ వీడియో బయటకు రాగా, క్షణాల్లో వైరల్ గా మారింది. ఇప్పటికీ పలు వివాదాలను ఎదుర్కొన్న పరాగ్ తాజాగా ఈ అంశం మరింత ఇబ్బందులకు గురి చేసింది. అయితే ఇది ఒరిజినల్ , ఫేక్ అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ వివాదంపై పరాగ్ స్పందించకపోవడం గమనార్హం. ఇంతకీ తన యూట్యూబ్ హిస్టరీ మిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం.

రియాన్ పరాగ్ ఒక గేమింగ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఇందులో లైవ్ స్ట్రీమింగ్ చేస్తాడు. ఈ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో పరాగ్ యూట్యూబ్‌లో కాపీరైట్ రహిత సంగీతాన్ని వెతుకుతుండగా తన యూట్యూబ్ స్క్రీన్ ని హైడ్ చేయడం మర్చిపోయిన్నట్టున్నాడు. దీంతో సెర్చ్ బార్ క్లిక్ చేసిన వెంటనే అతని యూట్యూబ్ సెర్చ్ హాస్టరీ కింద కనిపించింది. అందులో బాలీవుడ్ తారలు అనన్య పాండే మరియు సారా అలీ ఖాన్ పేర్లు కనిపించాయి. సారా అలీ ఖాన్ హాట్ మరియు అనన్య పాండే హాట్ అని గతంలో పరాగ్ యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లు కనిపించింది. పరాగ్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యవహారంలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై ఎలాంటి సమాచారం వెలువడలేదు. రియాన్ పరాగ్ గతంలో కూడా వివాదాల్లో తలదూర్చాడు. కొన్నిసార్లు సోషల్ మీడియా పోస్ట్‌ల వల్ల మరియు కొన్నిసార్లు మైదానంలో కొన్ని వింత చర్యల కారణంగా అతను వివాదాస్పదమయ్యాడు.

Also Read: Cyclone Remal: రెమ‌ల్ తుఫాను విధ్వంసం.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించిన ఐఎండీ..!

Exit mobile version