Site icon HashtagU Telugu

Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి తన ఫొటోలను పంచుకున్న పంత్.. ఎలా ఉన్నాడంటే..?

pant

Resizeimagesize (1280 X 720) 11zon

భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 30 డిసెంబర్ 2022న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత సుమారు 1 నెల ఆసుపత్రిలో గడిపిన తరువాత పంత్ ఇప్పుడు తన ఇంటికి చేరుకున్నాడు. పంత్ కోలుకోవడం గురించి సోషల్ మీడియాలో అభిమానులను అప్‌డేట్ చేస్తూనే ఉన్నాడు. రిషబ్ శుక్రవారం సాయంత్రం ఒక ట్వీట్ చేసాడు. అందులో అతను ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అతను ఇప్పుడు కొంచెం నడవడం ప్రారంభించినట్లు ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక అడుగు.. ముందుకు, ఒక అడుగు బలంగా, ఒక అడుగు మెరుగ్గా అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు.

పంత్ గతేడాది డిసెంబరు 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతుండగా కారు డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. స్థానికులైన ఇద్దరు యువకులు పంత్ ను కారు నుంచి బయటికి తీసుకువచ్చారు. అప్పటికే పంత్ కు తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో పంత్ కు ప్రమాదం తప్పింది.

టీమిండియా స్టార్ ఆటగాడు రిషభ్ పంత్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ తాను వేగంగా కోలుకుంటున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫోటో రిలీజ్ చేశాడు. చికిత్స తర్వాత పంత్ ఫస్ట్ ఫోటో ఇదే కావడం గమనార్హం. ఇందులో అత‌డి కుడి కాలికి బ్యాండేజ్ ఉండగా, వాకింగ్ స్టిక్స్ ప‌ట్టుకొని న‌డుస్తున్నాడు. పంత్‌ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: IND vs AUS Highlights: రోహిత్‌ శతకం, మెరిసిన జడ్డూ-అక్షర్‌.. రెండోరోజూ మనదే!

2022 చివరిలో బంగ్లాదేశ్ పర్యటనలో ఆడిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పంత్ భారత జట్టు కోసం అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో అతని బ్యాట్‌తో 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రెండవ మ్యాచ్‌లో జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేశాడు. పంత్ ఎప్పుడు మైదానంలోకి వస్తాడనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.