Site icon HashtagU Telugu

Pant Sets Fielding: బంగ్లాదేశ్ కు ఫీల్డింగ్ సెట్ చేసిన పంత్, వైరల్ వీడియో

Pant Sets Fielding

Pant Sets Fielding

Pant Sets Fielding: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచి విజయం దిశగా పయనిస్తోంది. భారత జట్టు 400 పరుగులకు పైగా ఆధిక్యం సాధించింది. చెన్నై టెస్టు మూడో రోజు తొలి సెషన్‌లో రిషబ్ పంత్ హఠాత్తుగా బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్‌ను సెట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రిషబ్ పంత్ (Rishabh Pant) మాటలు స్టంప్ మైక్‌లో మాటలు రికార్డ్ అయ్యాయి. ఇందులో పంత్ భాయ్ మిడ్‌వికెట్‌లో ఒకరు ఉండాలి, ఇక్కడ ఒక ఫీల్డర్ని సెట్ చెయ్ అని చెప్పడంతో స్పందించిన కెప్టెన్ పంత్ చెప్పినట్టుగా ఫీల్డర్ని సెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విశేషమేంటంటే 2019 వన్డే వరల్డ్ కప్ లోనూ ధోనీ ప్రత్యర్థి జట్టుకు ఫీల్డర్ని సెట్ చేశాడు. బాంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా ధోనీ ఇదేవిధంగా వ్యవహరించాడు. అయితే ధోనీ మాటకు స్పందించిన కెప్టెన్ ధోనీ చెప్పిన చోట ఫీల్డర్ని పెట్టడం అప్పట్లో వైరల్ గా మారింది.

పంత్ బంగ్లాదేశ్ (IND vs BAN) ఫీల్డర్లను సెట్ చేయడంతో వ్యాఖ్యాతలు నవ్వాపుకోలేకపోయారు. ఈ వీడియోకు అభిమానులు స్పందిస్తున్నారు. పంత్ తో మినిమమ్ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిలు ఔటైన తర్వాత శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ భారత ఇన్నింగ్స్‌ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.భోజన విరామానికి ముందు టీమిండియా 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇన్నింగ్స్ లో పంత్ 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు, గిల్ కూడా సెంచరీతో బాంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే ఈ టెస్టు మ్యాచ్‌లో 500 పరుగుల ఆధిక్యం సాధించిన తర్వాత రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది. ఎందుకంటే బంగ్లాదేశ్‌కు ఇంత పెద్ద లక్ష్యాన్ని కరిగించడం అంత సులువు కాకపోవచ్చు.

Also Read: IAF Chief : భారత వాయుసేన తదుపరి చీఫ్‌గా అమర్‌ప్రీత్ సింగ్‌ : రక్షణశాఖ