Site icon HashtagU Telugu

Rishabh Pant-Sanjiv Goenka: ఓటమి తర్వాత పంత్‌తో ల‌క్నో యజమాని మీటింగ్? వీడియో వైర‌ల్‌!

Rishabh Pant-Sanjiv Goenka

Rishabh Pant-Sanjiv Goenka

Rishabh Pant-Sanjiv Goenka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అభిమానులు విప‌రీతంగా ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఎల్‌ఎస్‌జి ఒక వికెట్ తేడాతో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక క్లిప్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. LSG కెప్టెన్ రిషబ్ పంత్.. మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత యజమాని సంజీవ్ గోయెంకాతో (Rishabh Pant-Sanjiv Goenka) మాట్లాడటం కనిపించింది. అయితే ఈ స‌న్నివేశంలో పంత్‌ను సంజీవ్ హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ 2024లో మాజీ కెప్టెన్ KL రాహుల్‌తో సంజీవ్ గోయెంకా వివాదాస్పద సంభాషణ జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసింది. గత ఏడాది LSG సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఓడిపోయిన తర్వాత జట్టు కెప్టెన్ KL రాహుల్ చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ మ్యాచ్‌లో 166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడి కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.

Also Read: Collectors Conference : నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్స్‌ కాన్ఫరెన్స్‌

సంజీవ్ గోయెంకా నుంచి రాహుల్‌కు విమర్శలు

ఈ నిరాశాజనక ప్రదర్శన తర్వాత అప్పటి LSG కెప్టెన్ రాహుల్ జట్టు యజమాని నుండి బహిరంగంగా తిట్టడం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైర‌ల్ అయింది. ఆ తరువాత సంజీవ్ గోయెంకా అతని ప్రవర్తనకు చాలా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇలాంటివి బహిరంగంగా జరగకూడదని పలువురు ఈ సందర్భంగా సూచించారు.

పంత్ కోసం ల‌క్నో రూ. 27 కోట్లు ఖర్చు చేసింది

పంత్, అతని జట్టు అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ మ్యాచ్ త‌ర్వాత కూడా సంజీవ్ మ‌రోసారి తాజా కెప్టెన్ పంత్‌తో అదే స‌న్నివేశం జ‌రిగింది. అయితే ఈ స‌న్నివేశంలో పంత్.. సంజీవ్‌కు ఏదో చెబుతున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. మెగా వేలంలో ఈ ఎడమచేతి వాటం ఆటగాడిని కొనుగోలు చేయడానికి LSG రూ. 27 కోట్లు వెచ్చించి. IPL 2024లో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా కూడా పంత్ నిలిచాడు.