Site icon HashtagU Telugu

IPL 2025: పంత్ కు కూడా ఢిల్లీ గుడ్ బై ? యువ వికెట్ కీపర్ పై చెన్నై కన్ను

Ipl 2025

Ipl 2025

IPL 2025: ఐపీఎల్ మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ జట్టు కూర్పుపై దృష్టి పెట్టాయి. ఇటీవలే కోచ్ రికీ పాంటింగ్ కు ఉద్వాసన పలికిన ఢిల్లీ క్యాపిటల్స్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కెప్టెన్ రిషబ్ పంత్ కు కూడా వీడ్కోలు పలికే అవకాశముంది. వచ్చే సీజన్ లో పూర్తిగా కొత్త జట్టుతో బరిలోకి దిగాలనుకుంటున్న ఢిల్లీ ఎంతమంది ప్లేయర్స్ ను రిటైన్ చేసుకుంటుందనేది తెలియడం లేదు. అయితే తమ టైటిల్ కల నెరవేర్చుకునేందుకు జట్టును పూర్తిగ ప్రక్షాళణ చేయాలని భావిస్తోంది. పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సపోర్ట్ ఉన్నప్పటికీ అతను బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ పంత్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ధోనీ వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా , అతని రోల్ ఎలా ఉండబోతోందన్న దానిపై పంత్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా పంత్ నే తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం డిసైడయినట్టు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ యువ వికెట్ కీపర్ అదరగొడుతున్నాడు. దీంతో మెగా వేలంలో పంత్ కు భారీ ధర పలికే అవకాశముంది. కాగా ధోనీ ఆటగాడిగా రిటైరయితే చెన్నై టీమ్ కు మెంటార్ గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ అప్పటి నుంచీ ఢిల్లీ క్యాపిటల్స్ కే ఆడుతున్నాడు. మొత్తం 8 సీజన్లలో 111 మ్యాచ్ లు ఆడిన పంత్ 148.93 స్ట్రైక్ రేట్ తో 3284 పరుగులు చేశాడు. దీనిలో 18 హాఫ్ సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఢిల్లీ జట్టును పంత్ నడిపించాడు. ఐపీఎల్ 17వ సీజన్ లో ఢిల్లీ 14 మ్యాచ్ లలో ఏడే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.

Also Read: Earth Speed : అప్పటికల్లా మనకు రోజుకు 25 గంటలు..!!