Rishabh Pant: ఐపీఎల్ 2025కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కి కొత్త కెప్టెన్‌గా భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఎంపికయ్యాడు. పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా సోమవారం ప్రకటించారు. IPL 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతను ఇప్పటికే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం మనకు తెలిసిందే.
పంత్‌ను ఎందుకు కెప్టెన్ చేశారో చెప్పిన సంజీవ్ గోయెంకా
IPL 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత మెగా వేలంలో LSG జట్టు పంత్‌పై విశ్వాసం వ్యక్తం చేసి 27 కోట్ల రూపాయలకు వేలంలో దక్కించుకుంది. గోయెంకా పంత్‌పై విశ్వాసం వ్యక్తం చేయడానికి కారణాన్ని కూడా చెప్పాడు. పంత్ గొప్ప నాయకుడని అన్నారు. అతను ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదగగలడని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు. రాబోయే 10-12 సంవత్సరాలలో ధోని, రోహిత్‌ల జాబితాలో పంత్ చేరతాడు. గత సీజన్‌లో ఎల్‌ఎస్‌జీకి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. లక్నో వేలానికి ముందు రాహుల్‌ను విడుదల చేసింది. అదే వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని కొనుగోలు చేసింది.
Also Read: Sunset Anxiety : సాయంత్రం వేళ మీరు కూడా నెర్వస్ గా ఫీల్ అవుతున్నారా..?
లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నప్పుడు తన 200 శాతం సత్తా చాటేందుకు ప్రయత్నిస్తానని రిషబ్ పంత్ చెప్పాడు. ఐపీఎల్ మెగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు పంత్. పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌తో చాలా కాలం అనుబంధం ఉంది. అయితే ఈసారి ఢిల్లీ అతడిని రిటైన్ చేసుకోకపోవడంతో మెగా వేలంలో అతడి ఎంట్రీ జరిగింది. రిషబ్ సారథ్యంలో ఢిల్లీ గత సీజన్‌లో ప్లేఆఫ్ టిక్కెట్‌ను పొందలేకపోయింది. పంత్‌ను జట్టులోకి తీసుకోవడానికి చాలా ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీ పోరు జరిగినా చివరికి లక్నో జట్టు విజయం సాధించింది.