DC VS CSK: స్లో ఓవర్ రేట్‌ కారణంగా రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల భారీ జరిమానా

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కు భారీ జరిమానా విధించారు.

DC VS CSK:  ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కు భారీ జరిమానా విధించారు. ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇది ఢిల్లీకి తొలి విజయం కాగా, రెండు మ్యాచ్ లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓటమిని చవిచూసింది.

చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించింది. దీని కారణంగా పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా పడిన రిషబ్ పంత్ ప్రస్తుత ఐపీఎల్‌లో రెండో కెప్టెన్‌గా నిలిచాడు. అంతకుముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా పడింది. అయితే జట్టు చేసిన తొలి నేరం కావడంతో పంత్, గిల్‌లకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇదే తప్పు పునరావృతమైతే కెప్టెన్లకు రూ.24 లక్షల జరిమానా విధిస్తారు. ఇది కాకుండా జట్టులోని ఇతర సభ్యులకు కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడుతుంది. మూడోసారి తప్పు చేస్తే కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఇతర జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తారు.

We’re now on WhatsAppClick to Join.

ఇదిలా ఉండగా వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల అభిమానుల ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సీజన్లో తొలిసారి బ్యాటింగ్ కి దిగిన చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ ఫోర్ల , సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. ధోనీ 16 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక చాన్నాళ్ల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో అలరించాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు మరియు మూడు సిక్సర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు.

Also Read: KTR : ‘KCR ఏం చేశారు..’ అనే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం