Site icon HashtagU Telugu

Rishabh Pant: కోహ్లీ రికార్డు బ‌ద్ద‌లుకొట్టిన రిష‌బ్.. ఇలా ఆడితే ఎలా పంత్‌..!

Rishabh Pant

Safeimagekit Resized Img (1) 11zon

Rishabh Pant: IPL 2024లో 40వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్.. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీగా ప‌రుగులు సాధించాడు. IPL చరిత్రలో ఒక్క మ్యాచ్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా ఒక బౌల‌ర్ బౌలింగ్ భారీగా ప‌రుగులు సాధించ‌లేదు. పంత్ కంటే ముందు RCB జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2013 సంవత్సరంలో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో 17 బంతులు ఆడిన కోహ్లీ 52 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో ఒక బౌలర్‌పై అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. విరాట్ కోహ్లీ 2013లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో భారీగా ప‌రుగులు సాధించాడు. ఉమేష్ యాదవ్ వేసిన 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీని తరువాత చాలా మంది బ్యాట్స్‌మెన్ బౌల‌ర్ల‌ను లక్ష్యంగా చేసుకున్నారు. కాని కోహ్లీ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. అయితే ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత రిషబ్ పంత్ చరిత్ర సృష్టించి విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. మోహిత్ శర్మతో జరిగిన ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 18 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్‌పైనైనా ఒక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగులు ఇదే.

Also Read: Railway Department: రైల్వే శాఖ కీల‌క నిర్ణయం.. తాగునీటి వృథాను అరిక‌ట్టేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌..!

IPL మ్యాచ్‌లో బౌలర్‌పై బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగులు

62(18) – రిషబ్ పంత్ vs మోహిత్ శర్మ, 2024
52(17) – విరాట్ కోహ్లీ vs ఉమేష్ యాదవ్, 2013
51(16) – హషీమ్ ఆమ్లా vs లసిత్ మలింగ, 2017
48(18) – KL రాహుల్ vs డేల్ స్టెయిన్, 2020
47(15) – కీరన్ పొలార్డ్ vs సామ్ కర్రాన్, 2019
47(18) – కీరన్ పొలార్డ్ vs అమిత్ మిశ్రా, 2014

దీంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా మోహిత్ శర్మ నిలిచాడు. మోహిత్ శర్మ నాలుగు ఓవర్లలో మొత్తం 73 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్ కూడా ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు ఇవ్వలేదు. ఇంతకుముందు ఈ రికార్డు బాసిల్ థంపి పేరిట ఉంది. అతను ఒక మ్యాచ్‌లో 70 పరుగులు చేశాడు.

We’re now on WhatsApp : Click to Join

ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో బౌలర్‌పై అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా రిషబ్ పంత్ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో రిషబ్ పంత్ 7 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు రస్సెల్, అయ్యర్, కోహ్లి, పొలార్డ్, గేల్ వంటి ఆటగాళ్లు ఒకే బౌల‌ర్‌పై 6 సిక్సర్లు కొట్టారు.